Record: ఒకే ఏడాది 7 రిలీజ్‌లతో స్టార్ హీరోయిన్ రికార్డ్

Anupama parameswaran sets record with 7 releases in a single year

Anupama parameswaran sets record with 7 releases in a single year

Record: ఈ తరం హీరోయిన్లకు అవకాశాలు దొరకడమే కష్టంగా ఉన్న రోజుల్లో, ఒకే ఏడాదిలో ఏడు సినిమాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఓ స్టార్ హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో అవకాశాలు దొరకక ఇబ్బంది పడ్డ ఆమె, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. బిగ్ బ్యానర్లు, స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లతో సినిమా చేయడం అంత ఈజీ ఏమీ కాదు. అయినా ఆమె ప్రతిభ, అందం, విభిన్న పాత్రల ఎంపికతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్క ఏడాదిలో ఏడు సినిమాలు పూర్తి చేయడం అంటే షూటింగ్స్, ప్రమోషన్స్‌ మధ్య బ్యాలెన్స్‌ చేయడం ఎంత కష్టమో చెప్పనవసరం లేదు. మల్టీ-స్టారర్స్ నుంచి విలన్ రోల్స్, ఎమోషనల్ డ్రామాల వరకు అన్ని జానర్స్‌లో నటిస్తూ ఈ హీరోయిన్ తన రేంజ్‌ను పెంచుకుంది. ఆ నటి ఎవరో తెలిసిందా?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇదే అరుదైన రికార్డ్. సాధారణంగా అగ్ర కథానాయికలు ఏడాదికి రెండు–మూడు సినిమాలు చేయడమే సవాలుగా భావించే సమయంలో, అనుపమ పరమేశ్వరన్ మాత్రం 2025లో ఏకంగా ఏడు సినిమాల రిలీజ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటువంటి రికార్డ్ ఇటీవల కాలంలో ఎవరూ సాధించలేదని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో విభిన్న రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది అనుపమ.

2015లో ‘ప్రేమం’తో ఎంట్రీ ఇచ్చిన ఆమె, గత కొన్నేళ్లుగా వరుసగా మంచి ప్రాజెక్టులు అందుకుంటూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ఏడాది తమిళంలో వచ్చిన ‘డ్రాగన్’, ‘బైసన్’ మంచి విజయాలు సాధించాయి. ‘ది పెట్ డిటెక్టివ్’ కామెడీతో ఆకట్టుకుంది. తెలుగులో ‘కిష్కింధపురి’, ‘పరదా’ భావోద్వేగ కథలతో మంచి స్పందన తెచ్చుకున్నాయి. మలయాళంలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ కోర్ట్‌రూమ్ డ్రామాగా ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడేమో ఆమె ఏడో సినిమా ‘లాక్‌డౌన్’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోవిడ్-19 నేపథ్యంతో రూపొందిన ఈ తమిళ సర్వైవల్ థ్రిల్లర్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌తో కలిసి ‘భోగి’ చిత్రంలో నటిస్తున్న అనుపమ, ఈ ఏడాది చేసిన రికార్డ్‌తో మల్టీ-ఇండస్ట్రీ స్టార్‌గా తన స్థానాన్ని మరింత బలపర్చుకుంది.

Also Read: Panchayat Elections: 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు.. తేదీలు ఇవేనా..?

Record: ఒకే ఏడాది 7 రిలీజ్‌లతో స్టార్ హీరోయిన్ రికార్డ్