Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్‌గా కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. చిన్నప్పుడే పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, పెద్దయ్యాక హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల ఆమె నటించిన మసూదా, బలగం, ఉస్తాద్ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘బలగం’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో కావ్యకు మరింత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె కొత్త ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతోంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా కావ్య చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు, రీల్స్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితంపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవతో కావ్య ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాల భైరవ మొదట గాయకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించి మంచి గుర్తింపు పొందాడు. తరువాత సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపిస్తూ పలుసినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. తన ప్రత్యేక శైలితో టాలీవుడ్‌లో మంచి స్థానం సంపాదించుకుంటున్నాడు.
టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, గత కొన్నేళ్లుగా కాల భైరవ మరియు కావ్య కళ్యాణ్ రామ్ మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని చెబుతున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారని, వారి సంబంధాన్ని ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని కూడా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే కీరవాణి కుటుంబంలో ఇటీవల ఒక పెళ్లి జరిగింది. ఆయన చిన్న కుమారుడు సింహా కోడూరి ప్రముఖ నటుడు మురళీమోహన్ మనవరాలిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పెద్ద కుమారుడు కాల భైరవ పెళ్లి కూడా జరగబోతుందన్న వార్తలు రావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఈ ప్రేమ, పెళ్లి వార్తలపై ఇప్పటివరకు కావ్య కళ్యాణ్ రామ్ లేదా కాల భైరవ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే వారి అధికారిక స్పందన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Monaliasa Wedding: ‘ఇది లవ్ జిహాద్’.. మోనాలిసా పెళ్లిపై కాంట్రవర్శియల్ కామెంట్స్
Tollywood: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్
