Silver Price: గణతంత్ర దినోత్సవం రోజున బంగారం, వెండి ధరలు మరోసారి వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చాయి. ఈ మధ్య కాలంలో బంగారం, వెండి రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా బంగారం, వెండి రేట్లు ప్రతి రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య అప్‌డేట్ అవుతాయి. ఇక బంగారం రేట్ల విషయానికొస్తే ఈ రోజున భారీగా పెరిగాయి.
ఇప్పటికే తగ్గుముఖంలో ఉన్నట్టుగా ఉదయం 6 గంటల సమయంలో కేవలం రూ.10 మాత్రమే తగ్గినా, కొద్ది గంటల్లోనే బంగారం ధరలు వేలల్లో ఎగబాకడం ఆశ్చర్యపరిచింది.
అందులో భాగంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,450 మేర పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.2,250 వరకు పెరిగింది. వెండి కూడా భారీగా పెరిగి కిలోకు రూ.5,000 వరకు ఎగబాకింది.
ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,710గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,150 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కిలో ధర రూ.3,75,000గా ఉంది. ఇదే వేగం కొనసాగితే వెండి ధర మరికొన్ని రోజుల్లో రూ.4 లక్షల దాకా చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,62,710గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,49,150గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,030 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం కూడా బంగారం రేట్ల పెరుగుదలకు కారణంగా చెప్పబడుతోంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర 5,000 డాలర్ల స్థాయిని దాటి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. గత రెండు సంవత్సరాల్లో బంగారం ధరలు రెండింతలకుపైగా పెరగడం బులియన్‌పై మార్కెట్ల నమ్మకాన్ని మరోసారి స్పష్టంచేసింది. ప్రస్తుతం బులియన్ ధర సుమారు 5,040 డాలర్ల వద్ద ఉంది.
Also Read: Gold Price: బంగారం ధరలు ఈ రేంజ్ లో తగ్గడం ఇదే ఫస్ట్ టైమా..?
Silver Price: వామ్మో.. రూ.4 లక్షల చేరువలో వెండి!
