Gas Cylinder: ఇక నుంచి 10 కేజీల ఎల్పీజీ సిలిండర్‌..?

LPG shortage: Oil companies consider smaller, 10 kg domestic cylinders amid Hormuz disruption, says report

LPG shortage: Oil companies consider smaller, 10 kg domestic cylinders amid Hormuz disruption, says report

Gas Cylinder: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకు ఎలాంటి కొరత తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రత్యామ్నాయ చర్యలను పరిశీలిస్తున్నాయి.

ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సరఫరా సజావుగా కొనసాగేందుకు సిలిండర్ బరువును తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగా, భవిష్యత్తులో 10 కిలోల ఎల్పీజీ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఉన్న సిలిండర్లలోనే 10 కిలోల గ్యాస్ నింపి పంపిణీ చేసే అవకాశాలపై పరిశ్రమ వర్గాలు పరిశీలిస్తున్నాయి. గ్యాస్ కొరత సమస్య రాకుండా ముందస్తుగా ఈ విధానాన్ని అమలు చేయాలని చమురు సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Telangana: పేరెంట్స్‌ను పట్టించుకోకపోతే జీతంలో రూ.10వేలు కట్!

Gas Cylinder: ఇక నుంచి 10 కేజీల ఎల్పీజీ సిలిండర్‌..?