Gold Rates: పండుగ పూట.. గోల్డ్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్

Gold Rate Today (February 15, 2026): Check Prices Of 24K, 22K & 18K

Gold Rate Today (February 15, 2026): Check Prices Of 24K, 22K & 18K

Gold Rates: ఫిబ్రవరి 15 నాటికి దేశంలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోల్చితే పెద్దగా మార్పుల్లేకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ మార్పులు, వడ్డీ రేట్లపై అంచనాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న అనిశ్చితి వంటి అంశాల ప్రభావంతో విలువైన లోహాల ధరలు సున్నితంగా కదులుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,57,750గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,44,600 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,310గా నమోదైంది.

ప్రధాన నగరాల వారీగా చూసుకుంటే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,58,840 ఉండగా, 22 క్యారెట్లు రూ.1,45,600గా ఉంది. ముంబైలో 24 క్యారెట్లు రూ.1,57,750, 22 క్యారెట్లు రూ.1,44,600గా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,57,900 కాగా, 22 క్యారెట్లు రూ.1,44,750గా ఉంది. కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కూడా 24 క్యారెట్లు రూ.1,57,750, 22 క్యారెట్లు రూ.1,44,600 చొప్పున ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఈ వివరాలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడినవి. మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ధరలు ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుంది.

బంగారం లేదా వెండి ధరల తాజా అప్‌డేట్స్ తెలుసుకోవాలనుకునే వారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి సమాచారం పొందవచ్చు.

Also Read: IND vs PAK: రేపు ‘మహా’ సంగ్రామం.. ఇప్పటి వరకు మనదే జోరు!
Gold Rates: పండుగ పూట.. గోల్డ్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్