Mobile Charging: మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నారా? ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేసినా కూడా త్వరగా బ్యాటరీ ఖాళీ అయిపోతుందా? కొద్దిసేపు ఇంటర్నెట్ వాడినా, వీడియోలు చూసినా వెంటనే ఛార్జింగ్ తగ్గిపోతే ఖచ్చితంగా చిరాకు వస్తుంది. ఎంత ఖరీదైన ఫోన్ అయినా బ్యాటరీ లైఫ్ బాగోలేకపోతే ఉపయోగంలో అసౌకర్యమే. అయితే కొన్ని సింపుల్ సెట్టింగ్స్ మార్చితే బ్యాటరీ ఎక్కువసేపు నిల్వ ఉండేలా చేయవచ్చు.
సాధారణంగా ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించడం, సినిమాలు చూడడం, మ్యూజిక్ వినడం, గేమ్స్ ఆడడం వంటివి బ్యాటరీ త్వరగా తగ్గే కారణాలు. అలాగే కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ డేటా, బ్యాటరీ వినియోగిస్తుంటాయి. దీంతో ఫోన్ వేడెక్కడం కూడా జరుగుతుంది. ఈ సమస్యలను తగ్గించడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటించాలి.
1. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఆఫ్ చేయండి
ఫోన్ డిస్‌ప్లే ఎప్పుడూ ఆన్‌లో ఉండే “Always On Display” ఫీచర్ బ్యాటరీ ఎక్కువగా ఖర్చు చేస్తుంది. దీన్ని ఆఫ్ చేయాలంటే:
Settings → Display → Lock Screen లోకి వెళ్లి “Always Show Info” లేదా “Always On Display” ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే బ్యాటరీ వినియోగం తగ్గుతుంది.
2. అడాప్టివ్ బ్యాటరీ ఆన్ చేయండి
చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో “Adaptive Battery” అనే ఫీచర్ ఉంటుంది. ఇది మీరు ఎక్కువగా ఉపయోగించే యాప్‌లను గుర్తించి బ్యాటరీ వినియోగాన్ని సమతుల్యం చేస్తుంది.
Settings → Battery → Adaptive Battery లోకి వెళ్లి ఈ ఆప్షన్‌ను ఎనబుల్ చేయండి. ఇది బ్యాటరీ లైఫ్ పెరగడంలో సహాయపడుతుంది.
3. బ్యాటరీ సేవర్ మోడ్ ఉపయోగించండి
Battery Saver మోడ్ ఆన్ చేస్తే ఫోన్‌లోని విజువల్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి, బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు పరిమితం అవుతాయి. దీంతో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంటుంది. ఈ మోడ్ ఆన్ చేస్తే చాలా ఫోన్లలో ఆటోమేటిక్‌గా డార్క్ మోడ్ కూడా ప్రారంభమవుతుంది.
ఈ చిన్న మార్పులు చేస్తే మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. సాధారణ వినియోగంతో పాటు సరైన సెట్టింగ్స్ ఉపయోగించడం ద్వారా బ్యాటరీ సమస్యను తగ్గించుకోవచ్చు.
