Gold Rates: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు

Gold Rate Today (25 February 2026), Gold Price in India

Gold Rate Today (25 February 2026), Gold Price in India

Gold Rates: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకపు విలువల్లో వచ్చే మార్పులు దేశీయ పుత్తడి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. భారతదేశం బంగారం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే పొందడం వల్ల, గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పెరిగినా తగ్గినా ఇక్కడ కూడా అదే ప్రభావం కనిపిస్తుంది.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్‌ ప్రకారం ఫిబ్రవరి 25న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,790గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,310 వద్ద కొనసాగుతోంది. ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమల్లో ఉన్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,350గా ట్రేడవుతోంది.

వెండి ధరల విషయానికి వస్తే, ఒకరోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,84,900 వద్ద ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,61,940 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,48,460గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,61,790, 22 క్యారెట్ల ధర రూ.1,48,310గా కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,62,450 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,48,910గా నమోదైంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు సుమారు 5,119 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ పెరగడం. ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడానికి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో ధరలు కొంత తగ్గాయి. దీనికి తోడు అమెరికన్ డాలర్ బలహీనత, యూఎస్ టారిఫ్ విధానాలపై ఉన్న అనిశ్చితి కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఇన్వెస్టర్లు కొత్తగా బంగారంలో పెట్టుబడి పెట్టడంలో వెనుకంజ వేస్తున్నారు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇవి ఉదయం 6 గంటల సమయానికి నమోదైన ధరలు మాత్రమే. రోజులో పరిస్థితిని బట్టి ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తాజా ధరలు మళ్లీ అప్‌డేట్ అవుతాయి.

Also Read: Holi: హోలీ పండుగ ఎప్పుడంటే?

Gold Rates: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు