Orkut is Coming Back: 2004… అప్పుడు Facebook లేదు, Instagram లేదు. ఇంటర్నెట్ అంటేనే ఆర్కుట్(Orkut). సాయంత్రం సైబర్ కేఫ్ కి వెళ్లి గంటకు 20 రూపాయలు ఇచ్చి Scraps చెక్ చేసుకోవడం ఒక యుగం.
ఎవరి ప్రొఫైల్ ఎవరు చూశారో తెలిసేది, అందుకే రోజుకి 10 సార్లు ప్రొఫైల్ ఫోటో మార్చేవాళ్ళం. Testimonial కోసం బెస్ట్ ఫ్రెండ్ ని బతిమిలాడేవాళ్ళం. “I Love My India”, “We Hate Exams” లాంటి Communities లోనే మన చిన్నప్పటి ప్రపంచం ఉండేది.
కానీ 2014లో Google, Facebook పోటీలో ఆర్కుట్ ని చంపేసింది. మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక క్లిక్ తో మాయమయ్యాయి. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే ఆర్కుట్ తిరిగి వస్తోంది. నిన్నటి నుండి orkut.com మళ్లీ ఓపెన్ అయ్యింది. ఇది పాత సైట్ కాదు. ఫౌండర్ Orkut Büyükkökten రాసిన ఒక ఓపెన్ లెటర్.

Also Read: Night Shift: చాలా డేంజర్.. నైట్ షిఫ్టులో పనిచేస్తున్నారా?
ఆయన అన్న మాట అందరినీ ఆలోచింపజేస్తోంది – “AI వల్ల ఇంటర్నెట్ లో మనిషి అనేవాడు కనిపించడం లేదు, మనం మళ్లీ మనుషుల కోసం ఇంటర్నెట్ ని తయారు చేద్దాం” అని. ఈరోజు Instagram లో ఫోటో నిజమో AI తో చేసిందో తెలియదు. Facebook లో కామెంట్ పెట్టింది మనిషో, బోటో తెలియదు. లైకులు, వ్యూస్ కోసం అల్గారిథమ్ మనల్ని ఆడిస్తోంది.
అందుకే కొత్త Orkut మూడు ప్రామిస్ లతో వస్తోంది:
1. మనిషి మాత్రమే: ప్రతి అకౌంట్ వెనుక నిజమైన మనిషి ఉన్నాడని వెరిఫికేషన్ ఉంటుంది. బోట్స్ కి నో ఎంట్రీ.
2. కమ్యూనిటీ ఫస్ట్: వైరల్ ఫీడ్ కాదు, నీకు నచ్చిన విషయాల కమ్యూనిటీ. మనుషులు మాట్లాడుకునే చోటు.
3. నీ ఇష్టం: ఏం చూడాలో AI కాదు, నువ్వే డిసైడ్ చేస్తావ్.
ఇప్పుడు సైట్ లోకి వెళ్తే “Bring Orkut Back” అని సంతకాలు సేకరిస్తున్నారు. ఇండియా, బ్రెజిల్ నుండి లక్షల మంది సపోర్ట్ చేస్తున్నారు. AI తో విసిగిపోయిన వారికి Orkut 2.0 ఒక కొత్త ఆశ. మరి 2004 మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా? చూద్దాం.
Also Read: Arjun Parmar: 18 వేల జీతంతో మొదలు – 3 ఏళ్లలో 75 లక్షలు – లేఆఫ్ ని కూడా ఓడించిన కుర్రాడి కథ
