Night Shift: రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? కాల్ సెంటర్, హాస్పిటల్, ఐటీ జాబ్ అని నైట్ షిఫ్ట్(Night Shift) చేస్తున్న మహిళలకు పరిశోధకులు షాకింగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజా అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే.. నైట్ షిఫ్ట్ చేసే మహిళల్లో శరీర జీవగడియారం (Body Clock) పూర్తిగా దెబ్బతింటోందట. దీనివల్ల జన్యువుల పనితీరు కూడా మారిపోతోందని తేలింది.
అసలు ఏం జరుగుతోంది?
మన శరీరానికి పగలు పని, రాత్రి నిద్ర అని ఒక సహజ లయ ఉంటుంది. దీన్నే Circadian Rhythm అంటారు. నైట్ షిఫ్ట్ వల్ల ఈ లయ పూర్తిగా తలకిందులవుతుంది. పగలు నిద్రపట్టదు, రాత్రి మేల్కొని ఉండాలి. దీంతో నిద్రలేమి (Insomnia) మొదలవుతుంది.
ఆడవారికి ఎందుకు ఎక్కువ ప్రమాదం?
పరిశోధకుల ప్రకారం, రాత్రి వేళల్లో వెలుతురులో పనిచేయడం వల్ల మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఇది నిద్రకు మాత్రమే కాదు, ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది. మెలటోనిన్ తగ్గితే హార్మోన్ల అసమతుల్యత మొదలవుతుంది. దీని వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, సంతాన సమస్యలు, బరువు పెరగడం, థైరాయిడ్ సమస్యలు వస్తాయి.
Heart Valve Disease: 55 ఏళ్ల తర్వాత ఈ 6 లక్షణాలు ఉంటే.. వెంటనే గుండె చెకప్ చేయించండి
అంతేకాదు, రోగనిరోధక శక్తి (Immunity) కూడా పడిపోతుంది. తరచూ జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు రావడం, ఎప్పుడూ అలసటగా ఉండటం, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కూడా నైట్ షిఫ్ట్ ఎఫెక్టే.
తప్పించుకోవడం ఎలా?
నైట్ షిఫ్ట్ తప్పనిసరి అయితే.. పగలు నిద్రపోయే గదిని పూర్తిగా చీకటిగా ఉంచండి, ఫోన్ చూడకండి, క్రమం తప్పకుండా ఒకే టైంకి నిద్రపోండి, హెల్తీ ఫుడ్ తినండి, విటమిన్ D చెక్ చేయించుకోండి.
డబ్బు కోసం రాత్రి పగలు కష్టపడటం మంచిదే, కానీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. మీ బాడీ క్లాక్ ని రెస్పెక్ట్ చేయండి.
Also Read: Pineapple After Meals: భోజనం తర్వాత పైనాపిల్ తింటే..
