Heart Valve Disease: ఇంట్లో తండ్రి సాయంత్రం వాకింగ్ మానేయడం, అమ్మ మెట్లు ఎక్కుతూ మధ్యలో ఆగిపోవడం, తాతయ్య ఎక్కువసేపు నిద్రపోవడం, తక్కువగా కదలడం… ఇవన్నీ మనం “వయసైపోతోంది లే” అని సర్దుకుపోతాం. కానీ ఫ్యామిలీ మెంబర్స్ గమనించే ఈ చిన్న మార్పులే గుండె సమస్యకు తొలి హెచ్చరికలు కావచ్చని కార్డియాలజిస్ట్ డా. ఆశిష్ అగర్వాల్ చెబుతున్నారు.
ముఖ్యంగా 55 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.
తప్పక గమనించాల్సిన 6 సంకేతాలు:
- రోజువారీ పనులకే ఆయాసం: ఇంటి పనులు చేస్తున్నప్పుడే ఆయాసం రావడం.
- విపరీతమైన అలసట: ఏ పనీ చేయకపోయినా నీరసంగా ఉండటం.
- తల తిరగడం: కళ్ళు తిరగడం, లైట్ గా అనిపించడం.
- కాళ్ళ వాపు: పాదాలు, చీలమండల దగ్గర వాపు రావడం.
- లైఫ్ స్లో అవ్వడం: నడక వేగం తగ్గడం, యాక్టివ్ గా లేకపోవడం.
- గుండె దడ: గుండె కొట్టుకోవడం మనకే తెలుస్తుండటం, దడగా అనిపించడం.
Also Read: Morning Symptoms: నిద్ర లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
ఇవి విడివిడిగా చూస్తే చిన్నవిగా అనిపిస్తాయి, ఒత్తిడి వల్ల, బిజీ లైఫ్ వల్ల అనుకుంటాం. కానీ ఇవి Heart Valve Disease కి సంకేతాలు కావచ్చు. గుండెలోని వాల్వ్ సరిగ్గా తెరుచుకోకపోయినా, మూసుకోకపోయినా గుండె రక్తాన్ని పంపడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈ జబ్బు నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి మొదట్లో తెలియదు.
ఈ మార్పులను మొదట గమనించేది పేషెంట్ కాదు, ఫ్యామిలీయే. కొడుకు, కూతురు, భార్యే ముందు గమనిస్తారు. కాబట్టి అలా గమనిస్తే సర్దుకుపోకుండా డాక్టర్ తో మాట్లాడండి.
55 ఏళ్లు దాటిన వారికి రొటీన్ హార్ట్ చెకప్ లో Echocardiogram – అంటే గుండెకు చేసే సింపుల్ అల్ట్రాసౌండ్ – చేయించండి. దీంతో వాల్వ్ ఎలా పనిచేస్తుందో ముందే తెలుస్తుంది.
Also Read: Healthy Labels: 8 కంపెనీల బండారం బయటపెట్టిన FSSAI
