Healthy Labels: మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు “హెల్తీ”, “జీరో మైదా”, “ఆర్గానిక్“, “వీగన్” అని లేబుల్ మీద ఉంటే కళ్లు మూసుకుని కొనేస్తాం. ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాం. కానీ ఆ నమ్మకాన్ని కొన్ని కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని FSSAI తాజా నివేదికలో బయటపడింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) 8 ప్రముఖ ఫుడ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. FSS Act 2006 ప్రకారం తప్పుడు లేబుల్స్, మోసపూరిత బ్రాండింగ్ చేస్తున్నాయని తేలింది.
మొదటి జాబితాలో “హెల్తీ” పేరుతో ఉన్న బ్రాండ్లే ఉన్నాయి. The Healthy Master అనే బ్రాండ్ “Vision to Serve Healthy” అనే స్లోగన్ వాడుతోంది, ఇది వినియోగదారుల్లో తప్పుడు భ్రమ కల్పిస్తుందని FSSAI చెప్పింది. అలాగే Troovy’s Healthy Mix Veggie Chips, Healthy Ragi Chips, Healthy Moong Dal Chips, Healthy Choice Poha, Emami Healthy & Tasty Oil, Health Aid Oil వంటి బ్రాండ్లు కూడా హెల్తీ అనే పదాన్ని అడ్డగోలుగా వాడుతున్నాయి.
Also Read: Pineapple After Meals: భోజనం తర్వాత పైనాపిల్ తింటే..
రెండో మోసం “జీరో మైదా”. Health Factory Zero Maida Whole Wheat Bread, Healthy Food Factory Zero Maida Pizza Base అని రాసి అమ్ముతున్నారు, కానీ లోపల ఉండే పదార్థాలు ఆ క్లెయిమ్ కి సరిపోవడం లేదు.
ఇంకా Neuherbs True Vitamin అనే పదానికి FSSAIలో నిర్వచనమే లేదు. Plan B Vegan బ్రాండ్ వీగన్ నిబంధనలు పాటించలేదు. Organic Wisdom, Two Brothers Organic Farms దగ్గర Jaivik Bharat లోగో లేదు. Storia Pomegranate Juiceలో కేవలం 4% మాత్రమే దానిమ్మ రసం ఉంది.
కాబట్టి లేబుల్ ని కాదు, వెనకాల ఉన్న Ingredients లిస్టుని చదవండి.
Also Read: Morning Symptoms: నిద్ర లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
