Telangana Folk: తెలంగాణ ఫోక్(Telangana Folk) సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి చిక్కుల్లో పడ్డాడు. మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో ఆయన ఓ గదిలో ఉన్న సమయంలో భార్య అక్కడికి చేరుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి బెడ్‌పై కూర్చుని ఉండగా.. ఈశ్వర్ సాయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వేములవాడలోని రెడ్డి భవన్లో మంగళవారం రాత్రి జరిగినట్లు సమాచారం. అయితే వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ఆధారంగా వారిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం ఉందని నిర్ధారించడం సాధ్యం కాదు.

ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరో మహిళతో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని ఆమె ఆరోపించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై ఈశ్వర్ సాయి నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడినట్లు సమాచారం లేదు.
ఇక ఈశ్వర్ సాయికి తెలంగాణ ఫోక్ మ్యూజిక్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల ‘బాసింగ బలాలు’ అనే ఫోక్ సాంగ్‌తో ఆయన మరింత పాపులర్ అయ్యారు. ఈ పాటలో ఈశ్వర్ సాయితో పాటు వైష్ణవి సోనీ నటించారు. విడుదలైన కొద్ది రోజులకే ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పాటు మిలియన్ల వ్యూస్ సాధించింది. పెళ్లిళ్లు, డీజే కార్యక్రమాల్లోనూ ఈ పాటకు మంచి క్రేజ్ వచ్చింది.
మరోవైపు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ గతంలోనూ పలు ఫోక్ సాంగ్స్‌లో కలిసి కనిపించారు. ‘రాతిరి రాతిరి రాతిరిలో’, ‘ప్రమీల’ వంటి పాటల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో, దానిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈశ్వర్ సాయి పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Also Read: Principal Murder Case: ఎంత దారుణం.. ప్రిన్సిపల్ ను చంపిన సొంత స్కూల్ విద్యార్థులు!
