Largest Electric Aircraft: 27 ని.ల విమాన ప్రయాణానికి కేవలం రూ.420.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం!

Largest Electric Aircraft Completes First Flight, Costs Just Rs,420 for 27 Minutes

Largest Electric Aircraft: విమాన ప్రయాణం అంటే సాధారణంగా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అయితే భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ విమానాలు ఈ పరిస్థితిని మార్చే అవకాశం కనిపిస్తోంది. స్వీడన్‌కు చెందిన హార్ట్ ఏరోస్పేస్ రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్(Largest Electric Aircraft)‘X1’ తాజాగా తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగాత్మక విమానం కేవలం 27 నిమిషాల పాటు గాల్లో ప్రయాణించగా.. ఇందుకు విద్యుత్ ఖర్చు కేవలం 5 డాలర్లు, అంటే సుమారు రూ.420 మాత్రమేనని కంపెనీ తెలిపింది.

న్యూయార్క్‌లోని ప్లాట్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి X1 తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ విమానం 30 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో రూపొందిస్తున్నారు. అయితే తొలి టెస్ట్ ఫ్లైట్‌లో మాత్రం పైలట్ మాత్రమే ప్రయాణించారు. భవిష్యత్‌లో ప్రయాణికులను కూడా తీసుకెళ్లేలా విమానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది.

World's largest battery-electric aircraft completes first flight - for the  price of a coffee - The Driven IO

X1 ప్రత్యేకత కేవలం దాని పరిమాణం మాత్రమే కాదు. ఇందులో మెగావాట్‌కు పైగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగల బ్యాటరీ-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతతో విమానాన్ని నడపడంతో సంప్రదాయ ఇంధనంతో నడిచే విమానాలతో పోలిస్తే నిర్వహణ ఖర్చులు, ఇంధన వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Also Read: Sania Mirza: ఫారెనర్ తో సానియా మీర్జా రెండో పెళ్లి?

ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే విమాన రంగంలోనూ బ్యాటరీ టెక్నాలజీని విస్తరించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే విమానాలకు అవసరమైన అధిక శక్తి, బ్యాటరీ బరువు, ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం వంటి సవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో X1 తొలి ప్రయాణం ఎలక్ట్రిక్ విమానాల అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

ప్రస్తుతం X1 ప్రయోగాత్మక దశలోనే ఉంది. పూర్తిస్థాయి వాణిజ్య ప్రయాణాలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే 30 సీట్ల విమానాన్ని ఎలక్ట్రిక్ ప్రొపల్షన్‌తో నడిపించే దిశగా జరుగుతున్న ఈ ప్రయత్నం విజయవంతమైతే.. భవిష్యత్‌లో ప్రాంతీయ విమాన ప్రయాణాల ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

ఒకప్పుడు కార్లు, బస్సులు మాత్రమే ఎలక్ట్రిక్ వైపు మారతాయని భావించినా.. ఇప్పుడు విమానయాన రంగం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. X1 వంటి ప్రయోగాలు భవిష్యత్‌లో మరింత పెద్ద, తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ విమానాలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది.

Also Read: Principal Murder Case: ఎంత దారుణం.. ప్రిన్సిపల్ ను చంపిన సొంత స్కూల్ విద్యార్థులు!