Samantha: రూ.1.16 లక్షల చీర, బ్లౌజ్‌లో సమంత.. ఈ లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Samantha in beautiful look at maa inti bangaram pre release event

Samantha: ఈ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ లెవల్ రేంజ్ లో దూసుకుపోతోంది సమంత రూత్ ప్రభు(Samantha). దాదాపు 4ఏళ్ల తర్వాత మళ్లీ ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆమె సంప్రదాయ చీరకట్టులో మెరిసి మరోసారి మా ఇంటి అడపిల్ల అనిపించుకుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్ లో జరిగింది. సమంత ఈ ఈవెంట్ కోసం లైమ్ గ్రీన్ రంగులో ఉన్న ఆర్గాంజా చీరను ఎంచుకుంది. ఆ ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక చోట షేర్ అవుతూనే ఉన్నాయి. మరి ఇంతకీ సామ్ కట్టుకున్న ఎంత ధర ఉండొచ్చు అన్న దానిపై ఇప్పుడు ఆన్ లైన్ లో చర్చ మొదలైంది.

చీర విషయానికి వస్తే.. సమంత కట్టుకున్న లైమ్ గ్రీన్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌తో దీనిని రూపొందించారు. పల్లుపై మారోడి ఎంబ్రాయిడరీ, పూల మోటిఫ్ డిజైన్‌తో పాటు అంచుపై గోటా వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చీర ధరెంతో తెలుసా.. ఏకంగా రూ.79,900 అని సమాచారం. సమంత ధరించిన బ్లౌజ్ కూడా ఈ బ్రాండ్‌దే. లైమ్ గ్రీన్ రంగులో ఉన్న ఈ బనారసి సిల్క్ బ్లౌజ్‌పై బంగారు జరీ దారంతో చేసిన మారోడి ఎంబ్రాయిడరీ ఆకట్టుకుంటోంది. వి-నెక్ డిజైన్‌తో పాటు వెనుక భాగం, చేతులపై ఉన్న ఎంబ్రాయిడరీ ఈ బ్లౌజ్‌కు మరింత అట్రాక్షన్ ను తీసుకొచ్చింది. దీని ధర రూ.36,900 అని టాక్.

Samantha Ruth Prabhu Makes Vibrant Fashion Statement In ₹1.16 Lakh Lime Green Saree At Maa Inti Bangaaram Event

చాలా మంది చీరకు తగ్గ జ్యువెల్లరీతో ఆకట్టుకుంటారు. కానీ సామ్ చీర, బ్లౌజ్‌నే హైలైట్ చేయాలనుకుంది కావచ్చు. అందుకే మెడలో భారీ ఆభరణాలు ధరించకుండా సింపుల్‌గా కనిపించింది. నేచురల్ మేకప్ తో జస్ట్ ముఖానికి ఒక చిన్న బొట్టుపిల్లతో వచ్చింది. జుట్టును సాఫ్ట్ వేవ్స్‌లో స్టైల్ చేసుకుని.. తన లుక్‌ను మరింత ఎలిగెంట్‌గా మార్చుకుంది. ఇక సమంత ధరించిన చీర, బ్లౌజ్ కలిపి సమంత ధరించిన దుస్తుల విలువ దాదాపు రూ.1.16 లక్షలు. దీంతో ఈ లుక్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది.

మా ఇంటి బంగారం సినిమా తర్వాత సమంత మళ్లీ వరుస సినిమాలు చేయనుందని సమాచారం. కానీ ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నందుకు కొన్ని రోజులు మళ్లీ వెండితెరపై కనిపించకపోవచ్చు. కానీ ఆ తర్వాత మాత్రం సామ్ మళ్లీ మునుపటిలాగే ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Also Read: Dhanush Politics: ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం..! లేటెస్ట్ అప్డేట్ ఇదే!