Lifestyle: రోజుకు 50 మెట్లు ఎక్కితే.. గుండె జబ్బులకు చెక్!

Daily stair climbing, disease susceptibility, and risk of atherosclerotic cardiovascular disease: A prospective cohort study

Daily stair climbing, disease susceptibility, and risk of atherosclerotic cardiovascular disease: A prospective cohort study

Lifestyle: రోజువారీ జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ముఖ్యంగా ఆఫీసుల్లో లేదా ఇంట్లో ఎక్కువసేపు కూర్చునే వారికి శరీరానికి సరైన వ్యాయామం దొరకడం కష్టమవుతుంది. అలాంటి పరిస్థితిలో మెట్లెక్కడం ఒక సులభమైన, ఖర్చు లేకుండా చేయగల మంచి వ్యాయామంగా నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు కనీసం 50 మెట్లు ఎక్కే అలవాటు పెంచుకుంటే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం దాదాపు 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మెట్లెక్కడం వల్ల గుండె వేగంగా పనిచేసి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో గుండె పంపింగ్ సామర్థ్యం బలపడటమే కాకుండా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరుగుతుంది. ఇది శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే రోజూ వేగంగా నడవడం లేదా కొంతసేపు brisk walk చేయడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

అయితే మెట్లెక్కడం అందరికీ సరిపోదు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా మెట్లెక్కితే ఒత్తిడి పెరిగి నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అలాంటి వారు మెట్లెక్కడం కంటే సాదాసీదాగా నడవడం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. టైమ్ తక్కువగా ఉన్నప్పుడు, జిమ్‌కు వెళ్లే అవకాశం లేకపోయినా మెట్లను ఉపయోగించడం మంచి ప్రత్యామ్నాయం అవుతుంది.

మొత్తంగా చూసుకుంటే, రోజువారీ పనుల్లో భాగంగా లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించడం వంటి చిన్న అలవాట్లు కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రోజు కొంతసేపు మెట్లెక్కే అలవాటు చేసుకోవడం మంచిదే.

Also Read: Taapsee: ప్యాడెడ్ బ్రాలు ధరించమనేవారు: తాప్సీ

Lifestyle: రోజుకు 50 మెట్లు ఎక్కితే.. గుండె జబ్బులకు చెక్!