Taapsee: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మరోసారి తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టడంతో సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. తన తాజా చిత్రం ‘అస్సీ’ ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమలో పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో హీరోయిన్లను ప్రధానంగా గ్లామర్ కోణంలోనే చూడడం జరిగేదని, పాటల చిత్రీకరణ సమయంలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే పేరుతో మేకర్స్ ప్యాడెడ్ బ్రాలు ధరించమని తనపై ఒత్తిడి తెచ్చేవారని తెలిపారు. సెట్‌లో వందలాది మంది ఉన్న సమయంలో, యూనిట్ సభ్యుల ముందే ఇలాంటి వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం తనకు చాలా అసౌకర్యంగా, అవమానకరంగా అనిపించేదని ఆమె చెప్పారు. ఒక మహిళగా అది చాలా బాధ కలిగించిందని కూడా స్పష్టం చేశారు.
ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పండ్లు లేదా కొబ్బరికాయలు వేయడం వంటి సన్నివేశాలపై తాప్సీ వ్యాఖ్యలు చేయడంతో పెద్ద వివాదం రేగింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు మళ్లీ, దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసం మాత్రమే ఉపయోగించే ధోరణి ఇంకా పూర్తిగా మారలేదని ఆమె విమర్శించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘అస్సీ’ చిత్రం ఫిబ్రవరి 20న విడుదలై మంచి స్పందన పొందుతోంది. ఈ సినిమాలో ఆమె సామూహిక అత్యాచార బాధితురాలి తరపున పోరాడే న్యాయవాది పాత్రలో కనిపిస్తున్నారు. మహిళా హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రస్తావించే ఈ కోర్ట్‌రూమ్ డ్రామాకు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండగానే, తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్
Taapsee: ప్యాడెడ్ బ్రాలు ధరించమనేవారు: తాప్సీ
