Rajastan: రాజస్థాన్‌కు చెందిన ఓ రైతు దొంగల భయంతో తన జీవిత పొదుపు అయిన రూ.5 లక్షలను ఇంట్లో కాకుండా పొలంలో పాతిపెట్టాడు. అయితే ఆ నిర్ణయం చివరకు అతనికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఏడాది తర్వాత ఆ డబ్బు బయటపడగా, అప్పటికే చెదపురుగులు నోట్లను కొరికి ముక్కలు ముక్కలుగా మార్చేశాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం, సుమారు ఏడాది క్రితం ఆ రైతు తనకు చెందిన భూమిని విక్రయించాడు. దాని ద్వారా వచ్చిన రూ.5 లక్షలతో ఇల్లు నిర్మించుకోవాలని భావించాడు. అయితే డబ్బును ఇంట్లో ఉంచితే దొంగతనం కావచ్చని, చేతిలో ఉంటే అవసరం లేని ఖర్చులకు వెళ్లిపోవచ్చని భావించాడు. దీంతో నగదును పాలిథిన్ సంచిలో పెట్టి, పొలంలో ఒక గుంత తవ్వి అందులో పాతిపెట్టాడు.
అయితే కొంతకాలం తర్వాత అతను డబ్బు దాచిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తుపట్టలేకపోయాడు. దీనికి అతని మద్యపాన అలవాటు, మతిమరుపు కూడా కారణమయ్యాయని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సమాచారం. పొలంలో పలుచోట్ల వెతికినా డబ్బు కనిపించలేదు. చివరకు నగదు దొరకదనే ఆశతో ఈ విషయాన్ని భార్య, కుమారులకు చెప్పాడు.
మొదట కుటుంబ సభ్యులు రైతు మాటలను పూర్తిగా నమ్మలేదు. అయినప్పటికీ డబ్బు కోసం పొలంలోని వివిధ ప్రాంతాల్లో గుంతలు తవ్వి వెతకడం ప్రారంభించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
కొంతకాలం తర్వాత వర్షాకాలంలో విత్తనాలు వేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న సమయంలో అనూహ్య పరిణామం జరిగింది. ఒక రాత్రి భూమిలో పాతిపెట్టిన పాలిథిన్ సంచి మట్టిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చీకటి కావడంతో అది ఎవరి దృష్టిలోనూ పడలేదు. మరుసటి రోజు ఉదయం పొలం చుట్టూ ఉన్న కంచెను మరమ్మతు చేస్తున్న రైతు భార్య, కుమారుడికి ఆ సంచి కనిపించింది.
जमीन में पैसे कौन दबाता है इस किसान ने अपना प्लोट बेचकर चोरी के डर से 5 लाख रूपये ज़मीन में दबा दिए।
कुछ दिन बाद पैसे निकाले सारे पैसे दिमाक खा गई और बड़ा नुक्सान उठाना पड़ा। pic.twitter.com/ByAvdK8BH3
— 𝗠𝗮𝗿𝗶𝘆𝗮𝗺_𝗠𝗕𝗗 (@Mariyam_MBD) August 9, 2026
సంచిని తెరిచి చూడగా అందులో ఏడాది క్రితం పాతిపెట్టిన నగదు ఉన్నట్లు గుర్తించారు. కానీ నోట్ల పరిస్థితి చూసి వారు షాక్‌కు గురయ్యారు. చెదపురుగులు నోట్లను కొరికి తీవ్రంగా దెబ్బతీశాయి. కొన్ని నోట్లు ముక్కలుగా మారిపోయాయి. దీంతో కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది.
పాడైన నోట్లలో ఏమైనా విలువను తిరిగి పొందే అవకాశం ఉందేమోనని భావించి కుటుంబ సభ్యులు వాటిని సేకరించి సమీపంలోని SBI శాఖను సంప్రదించినట్లు సమాచారం. అయితే నోట్ల పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆ శాఖ వాటిని స్వీకరించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలోని SBI ప్రధాన శాఖను కూడా సంప్రదించినా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది.
Also Read: Floating in Ponds: చెరువులోనే ఉంటున్న 16 ఏళ్ల యువకుడు!
