ఈ అవార్డుతో ఫిల్మ్‌ఫేర్ సంఖ్యలో మెగాస్టార్ చిరంజీవితో అల్లు అర్జున్ సమానమయ్యారు. చిరంజీవి తన కెరీర్‌లో 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకోగా, ఇప్పుడు బన్నీ కూడా అదే సంఖ్యను చేరుకున్నారు. అయితే చిరంజీవి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, స్పెషల్ లెజెండ్ అవార్డులతో కలిపి మొత్తం 9 ఫిల్మ్‌ఫేర్ గౌరవాలు పొందారు. అల్లు అర్జున్ గతంలో ‘పరుగు’, ‘వేదం’, ‘రేసుగుర్రం’ (క్రిటిక్స్), ‘రుద్రమదేవి’ (బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్), ‘సరైనోడు’, ‘పుష్ప: ది రైజ్’ సినిమాలకు కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా, 2027లో విడుదలయ్యే అవకాశముందని సమాచారం. మొత్తంగా ‘పుష్ప 2’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ, అవార్డుల పరంగా కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
ఇక 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు)లో ‘పుష్ప 2: ది రూల్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటిగా నివేదా థామస్ (‘35 చిన్న కథ కాదు’) ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటుడిగా అమితాబ్ బచ్చన్ (‘కల్కి 2898 AD’), సహాయ నటిగా అంజలి (‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’) గౌరవం పొందారు. క్రిటిక్స్ విభాగంలో కాజల్ అగర్వాల్ (‘సత్యభామ’), తేజ సజ్జ (‘హను-మాన్’) అవార్డులు అందుకున్నారు. సంగీతంలో దేవిశ్రీ ప్రసాద్ (‘పుష్ప 2’) బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు గెలుచుకోగా, ప్లేబ్యాక్ సింగర్‌గా శ్రీకృష్ణ, శిల్పా రావు విజేతలయ్యారు. ఇలా ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ వేడుకల్లో పుష్ప 2 చిత్రం స్పష్టంగా ఆధిపత్యం చాటింది.
Also Read: GST: కుండలు అమ్మే వ్యక్తికి ₹1.25 కోట్ల GST నోటీస్
Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్
