IndiGo Free Flight Tickets 2026: విమానం ఎక్కాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆర్థిక స్థోమత లేక కేవలం కలలకే పరిమితమవుతుంటారు ఎంతో మంది. తమ జీవితంలో అసలు ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కుతామా అని నిరాశ చెందే వారికి శుభవార్త. ఇప్పుడు మీరు ఎలాంటి టికెట్ ను కొనకుండానే విమానం(IndiGo Free Flight Tickets 2026)లో ప్రయాణించొచ్చు. భారతీయ విమానయాన రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఇండిగో (IndiGo Airlines) ఇప్పుడు తన 20 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఒక సంచలనాత్మక ఆఫర్‌ను ప్రకటించింది. IndiGoFree లేదా Happy IndiGo Day పేరుతో ఏకంగా 20,000 ఉచిత విమాన టికెట్లను అందిస్తోంది.
మీరు కూడా ఫ్లైట్ ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఉచిత టికెట్ పొందే ప్రాసెస్, నిబంధనలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఇండిగో ఫ్రీ టికెట్ ఆఫర్ వివరాలు (Offer Details)
ఇండిగో సంస్థ ప్రకటించిన ఈ ఆఫర్ ద్వారా ఎంపిక చేసిన ప్రయాణికులకు రూ. 10,000 వరకు ఫేర్ రీఫండ్ (Full Fare Refund) లభిస్తుంది.
-
మొత్తం ఫ్రీ టికెట్లు: 20,000 సీట్లు.
-
ఆఫర్ గడువు: ఆగస్టు 4, 2026 నుండి ఆగస్టు 6, 2026 వరకు మాత్రమే బుక్ చేయాలి.
-
ఎవరికి వర్తిస్తుంది: కేవలం దేశీయ విమాన ప్రయాణాలకు (Domestic Flights – Economy & Stretch) మాత్రమే వర్తిస్తుంది.
-
గరిష్ట రీఫండ్: ఒక్కో PNR పై గరిష్టంగా రూ. 10,000 తిరిగి ఇస్తారు.
ఉచిత ఫ్లైట్ టికెట్ కోసం ఎలా అప్లై / బుక్ చేసుకోవాలి?
ఈ ఆఫర్‌లో పాల్గొనడానికి ఎటువంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు సాధారణంగా టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది.
-
ఆగస్టు 4 నుండి 6 మధ్య ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను ఓపెన్ చేయండి.
-
మీ ప్రయాణ తేదీలు, గమ్యస్థానాన్ని ఎంచుకుని సాధారణ పద్ధతిలోనే టికెట్ బుక్ చేసుకోండి.
-
బుక్ చేసుకున్న ప్రయాణికులలో నుంచి లక్కీ డ్రా లేదా ప్రత్యేక ఎంపిక ద్వారా ఇండిగో రోజువారీ విజేతలను ఎంపిక చేస్తుంది.
-
ఎంపికైన విజేతలకు ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ వస్తుంది.
-
ఒక చిన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇస్తే, మీరు టికెట్ కోసం చెల్లించిన మొత్తం నుండి రూ. 10,000 వరకు 3 నుండి 5 రోజుల్లో రీఫండ్ అవుతుంది.

👉 అధికారిక ఇండిగో వెబ్‌సైట్ బుకింగ్ లింక్: IndiGo Official Booking Portal
⚠️ ఫేక్ వాట్సాప్ మెసేజ్‌ల పట్ల జాగ్రత్త!
ప్రస్తుతం సోషల్ మీడియాలో “ఈ లింక్ క్లిక్ చేస్తే ఇండిగో ఫ్రీ టికెట్ వస్తుంది” అని వచ్చే ఫేక్ లింక్‌లను క్లిక్ చేయకండి. ఇండిగో ఎప్పుడూ వాట్సాప్ లేదా థర్డ్ పార్టీ వెబ్‌సైట్లలో ఉచిత టికెట్లను నేరుగా ఇవ్వదు. కేవలం అధికారిక వెబ్‌సైట్ (goindigo.in) లేదా IndiGo App ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రీఫండ్ ఆఫర్ వర్తిస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Q1. ఏజెంట్ లేదా థర్డ్ పార్టీ యాప్స్ (MakeMyTrip, Paytm) ద్వారా బుక్ చేస్తే ఆఫర్ వస్తుందా?
జ: లేదు. కేవలం ఇండిగో డైరెక్ట్ ఛానెల్స్ (Website, Official App, 6Eskai Virtual Assistant) ద్వారా చేసిన బుకింగ్స్ మాత్రమే అర్హమైనవి.
Q2. అంతర్జాతీయ ప్రయాణాలకు (International Flights) ఇది వర్తిస్తుందా?
జ: లేదు. కేవలం భారత్‌లోని దేశీయ విమాన సర్వీసులకు (Domestic Flights) మాత్రమే వర్తిస్తుంది.
మీరు కూడా ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణం ప్లాన్ చేసుకుంటున్నట్టయితే.. ఇంకెందుకు ఆలస్యం.. ఆగస్టు 6 లోపు ఇండిగో యాప్‌లో టికెట్ బుక్ చేసుకోండి. ఈ ఆఫర్‌ను ప్రయత్నించండి. అదృష్టం బాగుంటే మీ టికెట్ కూడా ఉచితం కావచ్చు.
Also Read: Free CIBIL Score Check Online 2026: ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు.. సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చు
