Phone Hack: స్మార్ట్ ఫోన్.. ఎక్కడికెళ్లినా మర్చిపోలేని, వదిలి ఉండలేని సాధనంగా మారిపోయింది. ఫోన్ ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని సైతం మర్చిపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఇది డిజిటల్ యుగం. బ్యాంకింగ్, పర్సనల్ ఫోటోలు, పాస్వర్డ్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లను దాచుకునే వాల్ట్లా స్మార్ట్ ఫోన్ మారింది. అయితే, సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో హ్యాకర్లు రకరకాల మాల్వేర్లు, స్పైవేర్ల ద్వారా మన ప్రమేయం లేకుండానే ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. మరి మీ ఫోన్ హ్యాక్(Phone Hack) అయిందో లేదో ఎలా గుర్తించాలి? దానికి సంబంధించిన ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు (Warning Signs) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
![]()
1. బ్యాటరీ వేగంగా డ్రైన్ అవ్వడం (Unusual Battery Drain)
మీ ఫోన్ బ్యాటరీ సాధారణం కంటే చాలా వేగంగా అయిపోతుంటే జాగ్రత్త పడాలి. మీరు ఫోన్ ఉపయోగించకపోయినా బ్యాటరీ వేడెక్కడం లేదా చార్జింగ్ త్వరగా తగ్గిపోవడం జరుగుతుంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా హ్యాకింగ్ యాప్ లేదా స్పైవేర్ (Spyware) రన్ అవుతూ మీ డేటాను వేరే సర్వర్లకు పంపుతోందని అర్థం.
2. ఇంటర్నెట్ డేటా వేగంగా ఖర్చవ్వడం (High Data Usage)
మీరు ఎక్కువగా ఇంటర్నెట్ వాడకపోయినా కూడా రోజువారీ డేటా పరిమితి త్వరగా పూర్తయిపోతుందా? అయితే మీ ఫోన్లో మాల్వేర్ ఉందేమో చెక్ చేయండి. హ్యాక్ అయిన ఫోన్లలోని స్పైవేర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను హ్యాకర్లకు చేరవేసేందుకు ఎక్కువ మొత్తంలో ఇంటర్నెట్ డేటాను ఉపయోగిస్తాయి.
3. తెలియని యాప్‌లు, పాప్-అప్లు (Unknown Apps & Pop-ups)
మీరు డౌన్లోడ్ చేయని కొత్త యాప్‌లు ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తున్నాయా? లేదా పదే పదే వింత పాప్-అప్ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయా? ఇది ఖచ్చితంగా ఫోన్ హ్యాక్ అయిదనడానికి లేదా వైరస్ బారిన పడిదనడానికి సంకేతంగా గుర్తించవచ్చు.

4. ఫోన్ తీవ్రంగా స్లో అవ్వడం లేదా క్రాష్ అవ్వడం (Lagging Performance)
ఫోన్ ఉన్నట్టుండి తీవ్రంగా హ్యాంగ్ అవ్వడం, యాప్‌లు సరిగ్గా ఓపెన్ కాకపోవడం లేదా ఫోన్ తరచుగా రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంటే లోపల మాల్వేర్ ప్రాసెసింగ్ పవర్‌ను వాడుకుంటోందని అర్థం చేసుకోవాలి.
5. తెలియని మెసేజ్‌లు & ఓటీపీలు (Unusual Messages or OTPs)
మీ ప్రమేయం లేకుండానే మీ కాంటాక్ట్స్‌కి వింత లింక్‌లతో కూడిన మెసేజ్‌లు వెళ్లడం, లేదా మీరు అడగని ఓటీపీలు (OTPs) వరుసగా రావడం జరుగుతుంటే మీ అకౌంట్స్ ప్రమాదంలో ఉన్నాయని గుర్తించాలి.
ఫోన్ హ్యాక్ అయితే ఏమి చేయాలి?
-
వెంటనే ఇంటర్నెట్ (Wi-Fi / Mobile Data) ఆఫ్ చేయండి.
-
తెలియని లేదా అనుమానాస్పద యాప్‌లను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి.
-
మీ బ్యాంకింగ్, సోషల్ మీడియా మరియు జీమెయిల్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చండి.
-
సమస్య తీవ్రంగా ఉంటే ఫోన్‌ను ‘ఫ్యాక్టరీ రీసెట్’ (Factory Reset) చేయడం అత్యంత సురక్షితమైన మార్గం.
అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకపోవడం, థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుండి యాప్‌లను డౌన్లోడ్ చేయకపోవడం ద్వారా మీ ఫోన్‌ను హ్యాకర్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
Also Read: YouTube Search Safety: యూట్యూబ్‌లో ఈ పదాలను అస్సలు సెర్చ్ చేయకండి!
