Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10కు వచ్చే కంటెస్టెంట్లు – వారి రెమ్యూనరేషన్లు!

bigg boss telugu 10 contestants list & remuneration

Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పేరొందిన ‘బిగ్ బాస్ తెలుగు’ దాదాపు అందరికీ తెలిసిన కార్యక్రమమే. ఇప్పటికే 9 సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 10వ సీజన్ (Season 10) తో అలరించేందుకు సిద్ధమవుతోంది. మునుపటి 9 సీజన్లకు ఏ మాత్రం తగ్గకుండా బిగ్ బాస్ 10(Bigg Boss 10)ను మరింత గ్రాండ్‌గా, వినూత్న కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక గత 3 సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన ‘కింగ్’ అక్కినేని నాగార్జున ఇపుడు సీజన్‌ 10 ద్వారా ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఈ షో ప్రారంభానికి ముందే భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభానికి ముందే ఈ సీజన్ కు ఎవరెవరు కంటెస్టంట్లు గా రాబోతున్నారు.. వారికి రెమ్యునరేషన్లు ఎంత అన్న విషయాలపై మరింత ఆసక్తి నెలకొంది. అవి నిజమా, లేదా అన్న విషయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఈ విషయంపై మాత్రం ఎన్నో కథనాలు వైరల్ అవుతున్నాయి.

Bigg Boss 10: Contestants to Face Rs 10L Fine for Violating New Rules?

లీకైన కంటెస్టెంట్ల జాబితా (Rumored List)

బిగ్ బాస్ 10వ సీజన్‌లో 14 మంది సెలబ్రిటీలతో పాటు ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ కూడా హౌస్‌లో సందడి చేయనున్నారని సమాచారం. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న మెయిన్ సెలబ్రిటీల పేర్లు ఇవే:

ఎక్స్‌ప్రెస్ హరి (Express Hari): పాపులర్ కమెడియన్.

దీపికా రంగరాజు (Deepika Rangaraju): బుల్లితెర నటి (‘కార్తీక దీపం’ ఫేమ్).

రాకింగ్ రాకేష్ (Rocking Rakesh): కమెడియన్ & మూవీ ఆర్టిస్ట్.

తేజస్విని గౌడ (Tejaswini Gowda): ప్రముఖ సీరియల్ నటి.

మంగ్లీ / యాంకర్ నిఖిల్: క్రేజీ సింగర్ & యాంకర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు టాక్.

నందూస్ వరల్డ్ నందు & రమణ: డిజిటల్ క్రియేటర్లు & ఇన్‌ఫ్లుయెన్సర్లు.

ఉప్పల్ బాలు & పాండు మాస్టర్: సోషల్ మీడియా, డ్యాన్స్ రంగంలో పేరుపొందిన వ్యక్తులు.

చంద్రహాస్: యంగ్ యాక్టర్.

Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్! | Bigg boss telugu season 10 contestants list show hosted by nagarjuna

లీకైన రెమ్యూనరేషన్ వివరాలు!

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీల హోదా, వారి క్రేజ్‌ను బట్టి వారాంతపు పారితోషికాన్ని (Per Week Remuneration) నిర్ణయిస్తారు. ఈ సారి 10వ సీజన్ కావడం వల్ల ఈసారి బడ్జెట్ పరిమితులను పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

భారీ డిమాండ్స్:

కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు, పాపులర్ యూట్యూబర్లు ఈ సీజన్ కోసం ఏకంగా రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు మొత్తం ప్రాజెక్ట్ ప్యాకేజీ డిమాండ్ చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి.

వారానికి రూ. 3 నుండి 5 లక్షలు:

టాప్ సెలబ్రిటీలకు వారానికి రూ. 3.5 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు అందించేలా ఒప్పందాలు జరుగుతున్నట్లు సమాచారం.

యంగ్ స్టార్స్ & ఇన్‌ఫ్లుయెన్సర్లు:

సోషల్ మీడియా క్రియేటర్లకు వారానికి రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారట.

హోస్ట్ పారితోషికం:

షో విజయవంతంలో కీలక పాత్ర పోషిస్తున్న హోస్ట్ నాగార్జునకు కూడా ఈ సీజన్ కోసం రికార్డు స్థాయిలో భారీ రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నట్లు సమాచారం.

ఇవన్నీ పరిశీస్తుంటే కామన్ మ్యాన్, సెలబ్రిటీల కాంబినేషన్‌తో సరికొత్త గేమ్‌ప్లాన్‌తో రూపుదిద్దుకుంటున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10, బుల్లితెర ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారిక కంటెస్టెంట్ల ప్రకటన, గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌తో ఈ రెమ్యూనరేషన్లు, కంటెస్టెంట్లపై పూర్తి స్పష్టత రానుంది.

Also Read: AP Super Six Schemes: ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు.. ఎలా అమలవుతున్నాయంటే