Instagram: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET-UG 2026) రీటెస్ట్ ఫలితాల్లో కర్ణాటకకు చెందిన వైష్ణవి దాస్ సరికొత్త రికార్డు సృష్టించింది. 720 మార్కులకు గాను 700 మార్కులు సాధించి, ఆల్ ఇండియా లెవెల్లో 20వ ర్యాంక్ (AIR 20) కైవసం చేసుకోవడమే కాకుండా, కర్ణాటక స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం సాధించడానికి తాను అనుసరించిన ప్రత్యేక వ్యూహాలను, ప్రిపరేషన్ రహస్యాలను వైష్ణవి ఇటీవల మీడియా ద్వారా పంచుకున్నారు.
డిస్ట్రాక్షన్స్ దూరం.. ఇన్స్టాగ్రామ్ డిలీట్!
నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ఎక్కువగా సోషల్ మీడియాకు బానిసలవుతున్న తరుణంలో వైష్ణవి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తాను 11వ తరగతిలోకి ప్రవేశించగానే ఇన్స్టాగ్రామ్ (Instagram) అకౌంట్‌ను డిలీట్ చేసినట్లు ఆమె తెలిపింది. సోషల్ మీడియా(Social Media) వల్ల కేవలం సమయం వృథా అవ్వడం తప్ప ఎలాంటి లాభం లేదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడానికి ఇలాంటి ఆకర్షణలకు దూరంగా ఉండటం ఎంతో అవసరమని తోటి విద్యార్థులకు సూచించింది.
![]()
టైమ్ బౌండ్ కాదు.. టాస్క్ బౌండ్ ప్లానింగ్!
చాలా మంది రోజుకు ఇన్ని గంటలు చదవాలని టైమ్ టేబుల్ వేసుకుంటారు, కానీ వైష్ణవి శైలి భిన్నమైనది. “నేను రోజువారీ గంటలను ఎప్పుడూ లెక్కించలేదు. వారం మొత్తానికి ఒక ప్రణాళిక (Weekly Schedule) సిద్ధం చేసుకుని, ప్రతిరోజూ అనుకున్న టాస్క్‌లను పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టేదాన్ని” అని ఆమె పేర్కొంది.
విజయ సూత్రాలు:
-
NCERT రివిజన్: నీట్ పరీక్షకు NCERT పుస్తకాలే అత్యంత ప్రామాణికమైనవని, వాటిని పదే పదే రివిజన్ చేయడం తన మార్కులను పెంచిందని తెలిపింది.
-
మాక్ టెస్టులు: సిలబస్ పూర్తయిన తర్వాత ప్రతిరోజూ ఒకటి లేదా రెండు మాక్ టెస్టులు రాయడం వల్ల పరీక్షల ఒత్తిడిని అధిగమించగలిగానని వివరించింది.
-
పాజిటివ్ మైండ్‌సెట్: పరీక్షా సమయంలో ఎంత చదివామనే దానితో పాటు మానసికంగా దృఢంగా ఉండటం, సానుకూల దృక్పథం (Positive Mindset) కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని స్పష్టం చేసింది.
చిన్ననాటి నుండి డాక్టర్ కావాలనే బలమైన కోరిక గల వైష్ణవి దాస్.. భవిష్యత్తులో దేశ ప్రతిష్టాత్మక సంస్థ AIIMS New Delhi లో ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసి, వైద్య రంగంలో మరిన్ని పరిశోధనలు (Research) చేయాలని ఆకాంక్షిస్తోంది.
Also Read: Cleaning Toilets: ఏంటీ.. బాత్రూమ్ కడిగితే రూ.3 లక్షల జీతమా?
