Trisha: త్రిషకు మెగా ఫ్యామిలీ సర్‌ప్రైజ్ గిఫ్ట్!

Trisha receives the best birthday gift from Mega family

Trisha receives the best birthday gift from Mega family

Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రస్తుతం రెండు కారణాలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఒకవైపు మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి ఆమెకు ప్రత్యేక సమ్మర్ గిఫ్ట్ అందగా, మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో తన పేరును ముడిపెడుతూ వస్తున్న రూమర్ల నేపథ్యంలో చేసిన సోషల్ మీడియా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఉపాసన నిర్వహిస్తున్న “అత్తమ్మాస్ కిచెన్” నుంచి త్రిషకు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల రుచికరమైన పొడులు ఉన్నాయి. ఈ గిఫ్ట్ అందుకున్న త్రిష ఆనందం వ్యక్తం చేస్తూ, దాని ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “నిజంగానే వేసవి కాలం వచ్చేసినట్లు అనిపిస్తోంది” అంటూ ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్‌ను చూసిన అభిమానులు కూడా ఉపాసన ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదే సమయంలో త్రిష చేసిన మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్క బెడ్‌పై విశ్రాంతిగా పడుకుని ఉన్న ఫోటోను షేర్ చేసిన ఆమె, “నా వ్యక్తిగత విషయాల్లో ముక్కు పెట్టేందుకు నేను అనుమతించేది ఇదొక్కటే” అనే భావం వచ్చేలా క్యాప్షన్ జోడించారు.

గత కొంతకాలంగా తమిళనాడు సీఎం విజయ్‌తో త్రిష పేరును ముడిపెడుతూ సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ రూమర్లపై త్రిష ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ స్టోరీని చాలామంది నెటిజన్లు, ట్రోల్స్‌కు మరియు వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు పరోక్ష సమాధానంగా భావిస్తున్నారు.

ఇక ఇటీవల త్రిష “మ్యాజికల్ మే” పేరుతో కొన్ని ప్రత్యేక ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలలో ఆమె పుట్టినరోజు వేడుకల క్షణాలు, సెల్ఫీలు, పూల బొకేలు, వ్యక్తిగత జ్ఞాపకాలు, అలాగే తన పెంపుడు కుక్కతో గడిపిన మధురమైన సందర్భాలు కనిపించాయి. దీంతో ఆమె తాజా పోస్టులు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Also Read: Viral: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ‘.. 48 గంటల్లోనే 66 లక్షల ఫాలోవర్లు!

Trisha: త్రిషకు మెగా ఫ్యామిలీ సర్‌ప్రైజ్ గిఫ్ట్!