Silver Chappals: కిలోన్నర వెండితో అల్లుడికి చెప్పులు చేయించిన మామ

Silversmith crafts Kolhapuri chappal worth Rs 4.25 lakh using 1.5kg silver

Silversmith crafts Kolhapuri chappal worth Rs 4.25 lakh using 1.5kg silver

Silver Chappals: దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు బంగారం, వెండి కొనుగోళ్లను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. అయితే ఈ విజ్ఞప్తులు అందరిపై ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.

సాధారణంగా బంగారం, వెండితో నగలు లేదా దేవాలయాల్లో ఉపయోగించే వస్తువులు తయారు చేయిస్తారు. కానీ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త మాత్రం తన అల్లుడి కోసం ప్రత్యేకంగా వెండి కొల్హాపూరి చెప్పులు తయారు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చెప్పుల తయారీకి దాదాపు రూ.4 లక్షల 22 వేల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.

మహారాష్ట్రలో హిందూ సంప్రదాయం ప్రకారం ధోండీ మాసంలో అల్లుడికి ప్రత్యేక బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. ఈసారి ఆ సంప్రదాయాన్ని మరింత వైభవంగా చూపించాలని భావించిన వ్యాపారవేత్త, సాధారణ బహుమతుల బదులుగా వెండితో చేసిన కొల్హాపూరి చెప్పులను కానుకగా ఇవ్వాలని నిర్ణయించాడు.

దీని కోసం కొల్హాపూర్‌కు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులకు ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. మొత్తం 1.5 కిలోల స్వచ్ఛమైన వెండితో ఈ చెప్పులను తయారు చేశారు. సంప్రదాయ కొల్హాపూరి చెప్పుల నమూనాను వెండిపై అందంగా చెక్కడానికి కళాకారులు ఎన్నో రోజుల పాటు శ్రమించారు.

Silversmith crafts Kolhapuri chappal worth Rs 4.25 lakh using 1.5kg silver

ప్రస్తుతం వెండి ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ చెప్పుల మొత్తం విలువ రూ.4.22 లక్షలకు చేరుకుంది. ఇదే సమయంలో విలువైన లోహాల దిగుమతులు తగ్గించి విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తున్న విషయం తెలిసిందే.

ఒకవైపు ద్రవ్యోల్బణంతో సామాన్యులు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఇలాంటి విలాసవంతమైన కానుకలు సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. సాంగ్లీ-కొల్హాపూర్ ప్రాంతాల్లో ఈ వెండి చెప్పులు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Also Read: CM Vijay: ‘దళపతి’ కొత్త రూల్.. రూ.1000 లంచం పట్టిస్తే.. ఏకంగా రూ. లక్ష

Silver Chappals: కిలోన్నర వెండితో అల్లుడికి చెప్పులు చేయించిన మామ