Knee Pain: ఇలా చేస్తే.. మోకాళ్ల నొప్పులన్న మాటే ఉండదు..!

Natural Relief for Joint and Knee Pain Using Camphor

Natural Relief for Joint and Knee Pain Using Camphor

Knee Pain: మోకాళ్ల నొప్పులు ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. గుజ్జు అరిగిపోవడం, నడిచేటప్పుడు చప్పుళ్లు రావడం, నొప్పి పెరగడం వంటి లక్షణాలు సాధారణమైపోయాయి. చాలామంది తాత్కాలిక ఉపశమనం కోసం మందులు, ఆయింట్‌మెంట్లు వాడుతున్నా, శాశ్వత పరిష్కారం కోసం వెతుకుతూనే ఉంటారు.

ఈ నేపథ్యంలో హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ ఒక చిట్కాను సూచిస్తున్నారు. భీమసేని కర్పూరం (పచ్చ కర్పూరం) వాడితే మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందని ఆయన చెబుతున్నారు. దీన్ని సరైన విధంగా ఉపయోగిస్తే ఫలితం త్వరగా కనిపిస్తుందని వివరించారు.

భీమసేని కర్పూరం అనేది సినామొమమ్ కాంఫోరా అనే చెట్టు నుంచి తీసే సహజ పదార్థం. ఇది సాధారణ కర్పూరం కంటే శుద్ధిగా ఉంటుంది. అందుకే దీని వాసన ఘాటుగా, సుగంధంగా ఉంటుంది. ఇంట్లో పరిమళం కోసం, దోమలు దూరం పెట్టేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. అలాగే నరాల నొప్పులు, కీళ్ల నొప్పులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి దీనిని రెండు విధాలుగా వాడవచ్చు. ఒక విధంగా, పచ్చ కర్పూరాన్ని పొడి చేసి గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగవచ్చు. ఇలా తాగితే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే చల్లని నీళ్ల కంటే గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకుంటే మరింత మంచిది.

మరొక విధంగా, కర్పూరం పొడిని కొబ్బరి నూనెలో కలిపి ఉపయోగించవచ్చు. ముందుగా నూనెను కాస్త వేడి చేసి, అందులో కర్పూరం పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నొప్పి ఉన్న చోట నెమ్మదిగా రాసుకోవాలి. రోజులో అవసరాన్ని బట్టి రెండు మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కూడా వాడవచ్చు. మార్కెట్‌లో దొరికే చాలా ఆయింట్‌మెంట్లలో కూడా ఇదే పదార్థం వాడుతారు.

భీమసేని కర్పూరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో వాపు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అందువల్ల మోకాళ్ల నొప్పులు, నరాల నొప్పులు తగ్గుతాయి. కొబ్బరి నూనె మాత్రమే కాకుండా, ఇతర నూనెల్లో కూడా కలిపి వాడవచ్చు.

ఇది కేవలం కీళ్ల నొప్పులకే కాకుండా ఇతర సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. తలలో దురద, చుండ్రు ఉంటే నూనెలో కర్పూరం కలిపి రాస్తే ఉపశమనం లభిస్తుంది. జుట్టుకు నేచురల్ కండీషనర్‌లా పని చేసి, జుట్టు మృదువుగా మారేలా చేస్తుంది. అలాగే జుట్టు రాలడం కూడా కొంతవరకు తగ్గుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వేడి నీళ్లలో కర్పూరం వేసి ఆవిరి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

అయితే, ఇలాంటి చిట్కాలను ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Also Read: Viral: వీళ్లు జీవితంలో ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారు!

Knee Pain: ఇలా చేస్తే.. మోకాళ్ల నొప్పులన్న మాటే ఉండదు..!