Gold Rates: వారంలో బంగారం ధర ఎంత పెరిగిందంటే?

gold prices over silver rates stay steady in major cities

gold prices over silver rates stay steady in major cities

Gold Rates: ఇటీవల బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. రోజువారీగా చిన్నచిన్న హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, మొత్తం వారం మొత్తాన్ని చూస్తే బంగారం ధరలు పెరిగినట్టే చెప్పాలి. ఈ వారం ధరల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

హైదరాబాద్‌లో మార్చి 29న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,090గా ఉండగా, ఏప్రిల్ 4 నాటికి అది రూ.1,50,930కు పెరిగింది. అంటే వారం రోజుల్లో రూ.2,840 పెరుగుదల నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,750 నుంచి రూ.1,38,350కు చేరి సుమారు రూ.2,600 పెరిగింది.

చెన్నైలో కూడా ఇదే ధోరణి కనిపించింది. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,020 నుంచి రూ.1,52,180కు పెరిగి రూ.3,160 పెరుగుదల నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,600 నుంచి రూ.1,39,500కు చేరి రూ.2,900 పెరిగింది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,220 నుంచి రూ.1,51,080కు పెరిగి రూ.2,960 వృద్ధి చూపించింది. 22 క్యారెట్ల బంగారం కూడా రూ.1,35,900 నుంచి రూ.1,38,500కు పెరిగింది.

మొత్తం వారం ట్రెండ్ చూస్తే దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ఆదివారం నాటికి ఈ పెరుగుదలకు కొంత విరామం లభించింది. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,50,930 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,350 వద్ద ట్రేడవుతున్నాయి. వెండి ధర కూడా స్థిరంగా ఉండి, కిలో వెండి సుమారు రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది.

Also Read: సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారా? ఇకనుంచి ఆ పప్పులేం ఉడకవ్!

Gold Rates: వారంలో బంగారం ధర ఎంత పెరిగిందంటే?