Viral: కాళ్లు మొక్కుతా పాస్ చేయండి సార్.. విద్యార్థి లేఖ వైరల్

inter student Exam letter goes viral on social media

inter student Exam letter goes viral on social media

Viral: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి రాసిన వినూత్న ఉత్తరం వైరల్ అవుతోంది. పరీక్షలో పాస్ చేయమని కోరుతూ ఆ విద్యార్థి తన ఆన్సర్ షీట్‌లో రాసిన విషయాలు నెటిజన్లను నవ్వుల్లో ముంచేస్తున్నాయి. “సార్.. మీ కాళ్లు మొక్కుతా.. దయచేసి నన్ను పాస్ చేయండి” అంటూ ఎగ్జామినర్‌ను వేడుకున్న తీరు హాట్ టాపిక్‌గా మారింది.

ఆ లేఖలో కేవలం అభ్యర్థనలు మాత్రమే కాకుండా, కొన్ని ఆసక్తికరమైన బొమ్మలు కూడా ఉన్నాయి. ఒక బొమ్మలో విద్యార్థి తన గురువు కాళ్లపై పడిపడి నమస్కరిస్తున్నట్లు గీసి, పక్కనే “సార్ నేను” అని రాశాడు. “నాకు అమ్మా నాన్న లేరు సార్.. మీరే నాకు అన్నీ” అంటూ ఎగ్జామినర్‌ను ఎమోషనల్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, “నేను చదివినవి ఏవీ రాలేదు సార్.. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. ఆ దేవుడు మీరే” అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా, అచ్చంపేట ప్రాంతానికి చెందినదిగా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. “సార్.. మీరు పాస్ చేస్తే మీరు మంచి పని చేసినవారవుతారు.. ప్లీజ్ సార్” అని రాసిన ఈ వింత జవాబు పత్రం చూసి టీచర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. పరీక్షకు సిద్ధం కావడం కంటే, ఇలాంటి లేఖలు రాయడానికి ఎక్కువ సమయం కేటాయించినట్టుగా నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “ఇతని క్రియేటివిటీకి 100 మార్కులు ఇవ్వాలి” అని కొందరు చెబుతుండగా, “పాపం ఎగ్జామినర్ పరిస్థితి ఏంటి?” అని మరికొందరు చమత్కరిస్తున్నారు. చదువు బాగా రాకపోయినా, తెలివిగా ప్రాధేయపడే విద్యార్థుల టాలెంట్‌కు ఇది ఒక ఉదాహరణగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Also Read: Sleep Walking: నిద్రలో మాట్లాడటం, నడవడం ఒక జబ్బా?  

Viral: కాళ్లు మొక్కుతా పాస్ చేయండి సార్.. విద్యార్థి లేఖ వైరల్