War Effect: యుద్ధం తిప్పలు.. ‘షార్ట్స్ వేసుకోండి, మెట్లు ఎక్కండి’

Thailand orders bureaucrats to use stairs and work from home in energy saving drive

Thailand orders bureaucrats to use stairs and work from home in energy saving drive

War Effect: మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రధాని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు.

ఆఫీసుల్లో ఎయిర్ కండిషనర్లను 26–27 డిగ్రీల వద్దే ఉంచాలని సూచించారు. అలాగే సూట్లు, టైలు ధరించాల్సిన అవసరం లేదని, బదులుగా షార్ట్స్ మరియు సాధారణ షర్ట్లు వేసుకోవచ్చని తెలిపారు.

ఇంకా విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు లిఫ్ట్‌లకు బదులుగా మెట్లు ఉపయోగించాలని ఉద్యోగులకు సూచించారు. వీలైన చోట్ల వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పారు.

థాయిలాండ్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో దాదాపు 68 శాతం నేచురల్ గ్యాస్ నుంచే వస్తుంది. అందుకే ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.

Also Read: LPG Cylinder: 60 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన LPG సిలిండర్ ధర!

War Effect: యుద్ధం తిప్పలు.. ‘షార్ట్స్ వేసుకోండి, మెట్లు ఎక్కండి’