VIDEO: అమెరికా ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్లైన్స్ (United Airlines)కు చెందిన ఓ విమానానికి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఆదివారం ఒర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం ముందు టైరు ఊడి రన్వేపై పడిపోయింది. అయితే పైలట్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
CrashVision: Major Crash Averted!
📡 What We Know: A United Airlines flight narrowly avoided disaster during a landing at Orlando International Airport (MCO) after a nose wheel appears to detach from the front landing gear! Looks like a hard landing. No injuries were reported. pic.twitter.com/qqhPy12v1k— John Cremeans (@JohnCremeansX) January 19, 2026
పూర్తి వివరాల్లోకి వెళితే, చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో పాటు మొత్తం 206 మంది ప్రయాణికులను తీసుకుని యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం ఒర్లాండోకు బయలుదేరింది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా ముందు చక్రం విడిపోవడంతో ప్రమాదం సంభవించే పరిస్థితి ఏర్పడింది. అయితే పైలట్ విమానాన్ని అదుపులో పెట్టి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
విమానాన్ని రన్వేపైనుంచి తొలగించేందుకు ప్రత్యేక బృందాలు మోహరించగా, దీంతో ఎయిర్‌పోర్ట్‌లోని మరికొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వెల్లడించింది. లోపం ఎందుకు ఏర్పడిందో ఇంకా ఖచ్చితంగా తెలియలేదని, ఒర్లాండో ప్రాంతంలో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: Rashmika Mandanna: రూమర్స్ పై రష్మిక పాజిటివ్ రిప్లై
VIDEO: ల్యాండ్ అయ్యే లోపే ఊడిన టైరు
