Telangana: ఓటెయ్యడానికి వెళ్తూ.. అనంత లోకాలకు

Telangana: While going to cast their vote, dies in accident

Telangana: While going to cast their vote, dies in accident

Telangana: ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న బుర్ర కళ్యాణ్ (27), నవీన్ (27) అనే స్నేహితులు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి బయలుదేరారు.

ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రాఘవపూర్ వద్ద జాతీయ రహదారిపై వారి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Also Read: Lionel Messi: రూ.12 వేలతో టికెట్ కొన్నాడు.. మెస్సీని చూడలేదన్న నిరాశతో..

Telangana: ఓటెయ్యడానికి వెళ్తూ.. అనంత లోకాలకు