Fridge Explosion: ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి!

Telangana: Two killed in refrigerator fire at Nirmal

Telangana: Two killed in refrigerator fire at Nirmal

Fridge Explosion: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. జిల్లాలోని బంగల్‌పేట్ సమీపంలోని మహాలక్ష్మివాడ సి-బ్లాక్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

అయితే తీవ్ర గాయాలతో ఉన్న గుర్తుతెలియని మహిళ (సుమారు 40 ఏళ్లు) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంటి యజమాని ఒడిసెల విజయ్ (50) కూడా తీవ్రంగా గాయపడడంతో, అతన్ని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Gold Rates: వారంలో బంగారం ధర ఎంత పెరిగిందంటే?

Fridge Explosion: ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి!