Chevella Accident: 21 మంది చనిపోయిన మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్స్, ఉపాధి కోసం బయల్దేరిన కూలీలు, ఆస్పత్రిలో చికిత్స కోసం బస్సెక్కిన ఫ్యామిలీ, రైలు మిస్ కావడంతో బస్ అందుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక్కో కథ, కల. కానీ అవన్నీ ఒక్క ప్రమాదంతో కల్లలయ్యాయి. కంకర టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు అందరి జీవితాలకు రాళ్ల సమాధి కట్టింది.
బస్సు ప్రమాదంలో 21 మంది మృతి.. విచారణకు ఆదేశం
రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది మరణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తొలుత 19 మంది చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని పేర్కొన్నారు. అందులో 10 మంది మహిళలు, 2 నెలల చిన్నారి ఉన్నారని చెప్పారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు.







