- రూ.3లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
రూ.3లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 34 వేల 406 కోట్లు
మూలధన వ్యయం రూ. 47వేల 267 కోట్లు
- తెలంగాణ 2026-27 బడ్జెట్‌లో కీలక అంశాలు
పశు సంవర్థక శాఖకు రూ. 1,529కోట్లు కేటాయింపు
విద్యుత్ శాఖకు రూ. 21,285 కోట్లు కేటాయింపు
రాష్ట్రంలోని 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల 2 వేల స్కాలర్ షిప్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 13,679 కోట్ల కేటాయింపు
కార్మిక శాఖకు రూ. 998కోట్లు కేటాయింపు
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ. 3,143 కోట్లు కేటాయింపు
ఎస్సీ సంక్షేమానికి రూ. 11,784కోట్లు కేటాయింపు
ఎస్టీ సంక్షేమానికి రూ. 7,937 కోట్లు కేటాయింపు
బీసీ సంక్షేమానికి 3,769 కోట్లు కేటాయింపు
రాజీవ్ యువ వికాసానికి 6 వేల కోట్లు కేటాయింపు
గృహా నిర్మాణ శాఖకు 7,430కోట్లు కేటాయింపు
- రైతు భరోసా – రూ.18 వేల కోట్లు కేటాయింపు
చేయూత – రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు – రూ.5,500 కోట్లు
మహాలక్ష్మి పథకం – రూ.4,305 కోట్లు
వడ్ల బోనస్ – రూ.3,500 కోట్లు
గృహజ్యోతి – రూ.2,080 కోట్లు
ఆరోగ్య శ్రీ – రూ.1143 కోట్లు
LPG సబ్సిడీ – రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు
విద్యుత్ సబ్సిడీ – రూ.14 వేల కోట్లు
బియ్యం సబ్సిడీ – రూ.3 వేల కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ – రూ.3,683 కోట్లు
విద్యార్థుల మెస్ ఛార్జీలు – రూ.2,170 కోట్లు
స్కాలర్‌షిఫ్‌లు – రూ.4,343 కోట్లు
ఎస్‌డీఎఫ్ – రూ.3,300 కోట్లు
ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ – రూ.2,622 కోట్లు
వ్యవసాయ శాఖ – రూ.23,179 కోట్లు
పశుసంవర్ధక శాఖ – రూ.1,529 కోట్లు
విద్యుత్ శాఖ – రూ.21,285 కోట్లు
విద్యా శాఖ – రూ.26,674 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖ – రూ.13,6379 కోట్లు
కార్మిక శాఖ – రూ.998 కోట్లు
- విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.2వేల స్కాలర్‌షిప్
తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
ఇకపై రాష్ట్రంలో ఇంటర్ చదివే విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం పెట్టనున్నట్టు ప్రకటించింది
విద్యార్థులకు సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్న డిప్యూటీ సీఎం
అలాగే ఐఐటీ, ఏటీసీఎల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2వేల స్కాలర్‌షిప్ అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
- రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
కొత్తగా 2లక్షల చేయూత పెన్షన్‌ల ప్రకటన
బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రకటన
- రాష్ట్ర ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా
మరో సరికొత్త పథకాన్ని ప్రకటించిన తెలంగాణ సర్కార్
ఇందిరమ్మ కుటుంబ జీవన బీమాను ప్రకటించిన ప్రభుత్వం
ఈ పథకం కింద 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి
ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల జీవిత భీమా అందించనున్నట్టు ప్రకటన
- రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్‌పై ప్రారంభంపై కీలక ప్రకటన
ఈ ఏడాది చివరి నాటికి కొన్ని హాస్పిటల్స్‌ను ప్రారంభించనున్నట్టు తెలిసిన డిప్యూటీ సీఎం
2026 చివరి నాటికి సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ ‘టిమ్స్’లను ప్రారంభించనున్నట్టు ప్రకటన
- గుడ్‌న్యూస్.. ఈ ఏడాది నుంచి స్కూళ్లలో కొత్తగా బ్రేక్ ఫాస్ట్ పథకం
రాష్ట్రంలోని స్కూల్, కాలేజ్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే పథకాన్ని ప్రారంభించబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
- ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందకు నిర్ణయం
బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి
త్వరలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ప్రారంభిస్తున్నట్టు ప్రకటన
రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 421 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు చికిత్స పొందవచ్చన్న డిప్యూటీ సీఎం
ఇందులో భాగంగానే ప్రతి ఉద్యోగికి డిజిటల్ కార్డు
