Sachin: ‘చిన్నప్పుడు నన్ను చిన్న సత్యసాయి అనేవారు’

Sachin: 'When I was young, they called me Little Sathya Sai'

Sachin: శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యరాయ్ తదితరులు హాజరయ్యారు. బాబా మహాసమాధిని దర్శించిన మోదీ ప్రత్యేక పూజలు చేసి, గోదాన కార్యక్రమంలో నలుగురు రైతులకు గోవులను దానం చేశారు. అనంతరం సాయి కుల్వంత్ సభా మందిరంలో వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని, హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.

ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ సత్యసాయి సేవా తత్వాన్ని స్మరించారు. మానవసేవే మాధవసేవ అని బాబా చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, విద్య ద్వారా ఎన్నో పిల్లల జీవితాలు మారుతున్నాయని, లక్షల మందికి ఉచిత వైద్యం అందించడంలో సత్యసాయి సంస్థలు గొప్పగా సేవ చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

క్రికెటర్ సచిన్ కూడా పుట్టపర్తి తనకు ప్రత్యేకమైన స్థలమని చెప్పారు. 1997 నుంచి బాబాతో అనుబంధం ఉందని, చిన్నప్పుడు తన హెయిర్‌ స్టైల్‌ చూసి “చిన్న సత్యసాయి” అని పిలిచేవారని చెప్పారు. పుట్టపర్తికి అనేకసార్లు వచ్చి బాబా ఆశీర్వాదం పొందానని, జీవితంలో సందిగ్ధతల సమయంలో బాబా మార్గనిర్దేశం చేశారని సచిన్ తెలిపారు. 2011 వరల్డ్ కప్ సమయంలో కూడా బాబా ఫోన్ చేసి ధైర్యం ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు.

Also Read: Telangana: ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్‌

Sachin: ‘చిన్నప్పుడు నన్ను చిన్న సత్యసాయి అనేవారు’