Modi: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ సత్యసాయి విశ్వప్రేమకు ప్రతీక అని, భౌతికంగా ఆయన లేకపోయినా ప్రేమ రూపంలో ఇప్పటికీ మనతో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన బోధనలు దేశమంతటా ప్రభావం చూపుతున్నాయని, కోట్లాది భక్తులు మానవసేవ చేస్తూ సత్యసాయి ప్రేమసూత్రాలను అనుసరిస్తున్నారని తెలిపారు.

