Petrol Shortage: మొన్నటిదాకా గ్యాస్.. ఇప్పుడేమో పెట్రోల్.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు..!

Petrol Shortage: Petrol scarcity—'No Stock' boards at fuel stations!

Petrol Shortage: Petrol scarcity—'No Stock' boards at fuel stations!

Petrol Shortage: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం పెట్రోల్, డీజిల్ సరఫరాపై పడుతోంది. దిగుమతులు తగ్గడం, డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో ఇంధన ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.2.26 పెరిగినట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి తెలిపారు. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలో పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎంత మేరకు పెరుగుతాయో ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేదని చెప్పారు.

డాలర్ విలువ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధరలు పెరగడం వల్ల ప్రభుత్వంపై భారం పెరుగుతోందని, అందువల్ల ధరలు పెరగడం తప్పదని ఆయన పేర్కొన్నారు. అయితే గత రెండు మూడు సంవత్సరాల్లో ఇంధన ధరలు పెద్దగా పెరగలేదని గుర్తు చేశారు. ఈసారి కూడా ఒక్కసారిగా భారీగా పెరగకపోవచ్చని అన్నారు.

ఇక మరోవైపు, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొన్ని పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయి. దీనికి మరో కారణంగా ఆయిల్ కంపెనీల విధాన మార్పులను అమరేందర్ రెడ్డి వివరించారు. ఇప్పటివరకు డీలర్లకు క్రెడిట్‌పై ఇంధనం ఇచ్చిన కంపెనీలు, ఇప్పుడు ఆ సౌకర్యాన్ని తగ్గించి, బకాయిలతో పాటు ముందస్తుగా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. దీంతో చాలా మంది డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 40 శాతం పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడినట్లు ఆయన చెప్పారు.

అదనంగా, పెట్రోల్ కొరత వస్తుందనే భయంతో వినియోగదారులు అవసరానికి మించి ఇంధనం తీసుకుంటుండటం కూడా సమస్యను మరింత పెంచుతోందన్నారు. గతంలో ఆయిల్ కంపెనీలు డీలర్లకు క్రెడిట్‌ను సులభంగా అందించేవని, కానీ ఇప్పుడు బకాయిలను వసూలు చేసుకునేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు ఇంధన వినియోగంపై అవగాహన కల్పిస్తే కొంతవరకు సమస్యను తగ్గించవచ్చని సూచించారు. ముందస్తుగా బుకింగ్ చేసిన వారికి కూడా సరిపడా స్టాక్ ఇవ్వడంలో ఆయిల్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. మొత్తంగా చూస్తే, సరఫరా సమస్యలు, మార్కెట్ పరిస్థితులు కలిసి ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Also Read: Telangana Budget 2026: రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. పూర్తి వివరాలు

Petrol Shortage: మొన్నటిదాకా గ్యాస్.. ఇప్పుడేమో పెట్రోల్.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు..!