ISRO: PSLV-C62 విఫలం.. అయినా పని చేసింది!

ISRO PSLV-C62 failed... yet it worked!

ISRO PSLV-C62 failed... yet it worked!

ISRO: ఇస్రో చేపట్టిన PSLV-C62 రాకెట్ ప్రయోగం గతరోజు విఫలమైందని తెలిసిందే. మూడో దశను పూర్తి చేసే సమయంలోనే రాకెట్ లోపం ఏర్పడి మిషన్ ఆగిపోయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే… ఈ విఫలత మధ్యలోనూ ఒక ఉపగ్రహం విజయవంతంగా వేరుపడి, తన పని చేసింది. ఈ పరిణామాన్ని స్పెయిన్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘ఆర్బిటల్ పారడైజం’ అధికారికంగా వెల్లడించింది.

వారి ప్రకారం, PSLV నాలుగో దశలో అమర్చిన కెస్ట్రెల్ ఇనీషియల్ డెమోన్‌స్ట్రేటర్ (KID) పేరుగల చిన్న క్యాప్సుల్ సురక్షితంగా విడిపోయి, భూమికి సుమారు 3 నిమిషాలపాటు అత్యంత కీలకమైన డేటాను పంపినట్లుగా తెలిపారు. ఈ క్యాప్సుల్ ఫుట్‌బాల్ పరిమాణంలో ఉండి, బరువు దాదాపు 25 కిలోల మాత్రమే. PSLV వంటి ప్రయోగ వాహనాల ద్వారా భవిష్యత్‌లో చిన్న ఉపగ్రహాలు మరియు పరిశోధనా క్యాప్సుల్‌ లను అంతరిక్షంలోకి ఎలా పంపాలన్న దానిపై తమ కంపెనీ పరీక్షలు నిర్వహిస్తోందని ఆర్బిటల్ పారడైజం వెల్లడించింది.

సాధారణంగా ఏ రాకెట్ ప్రయోగంలోనైనా మిషన్ పూర్తిగా విఫలమైతే అందులోని ఇతర లోడ్లు పని చేయడం కష్టమే. కానీ ఈ సందర్భంలో PSLV ప్రయోగం మూడో దశలోనే నిలిచిపోయినా, KID క్యాప్సుల్ విజయవంతంగా వేరుపడి పనిచేయడం స్పేస్ పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీసింది. విఫలమైన ప్రయోగంలో కూడా డేటా సేకరించడం అరుదైన విషయం కావడంతో, అంతరిక్ష వర్గాలు దీనిని సాంకేతికంగా ముఖ్యమైన సంఘటనగా పేర్కొంటున్నాయి.

ఆర్బిటల్ పారడైజం దీనిని తమ అభివృద్ధి ప్రయాణంలో పెద్ద అడుగుగా పేర్కొంది. మరోవైపు PSLV-C62 విఫలతపై ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషణ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అధికారిక కారణాలు వెల్లడవుతాయని అంచనా.

Also Read: Iran Protest: ఇరాన్ నిరసనల్లో 12 వేల మంది చనిపోయారా?

ISRO: PSLV-C62 విఫలం.. అయినా పని చేసింది!