Magh Purnima: ఇలాంటి రోజు మళ్లీ 100 ఏళ్ల తర్వాతే.. ఏమేం చేయాలంటే..

Magha Purnima 2026 | Date, Rituals & Spiritual Benefits

Magha Purnima 2026 | Date, Rituals & Spiritual Benefits

Magh Purnima: మఘా నక్షత్రంలో చంద్రుడు సంచరించే పౌర్ణమిని ‘మాఘ పౌర్ణమి’గా జరుపుకుంటారు. ఈ ఏడాది మాఘ పౌర్ణమి 2026 ఫిబ్రవరి 1వ తేదీన జరగనుంది. ఈసారి వచ్చే మాఘ పౌర్ణమి అరుదైన గ్రహయోగాలతో ఉండటంతో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మఘ నక్షత్రంలో చంద్రుడు ఉన్న పౌర్ణమి రోజున చేసే పరిహారాలు అపమృత్యు దోషం నుంచి రక్షణ ఇస్తాయని, ఆయుష్షును పెంచుతాయని చెబుతారు. ఈ కాలంలో మిగతా గ్రహాలు ఒక్కొక్కటిగా మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో దాదాపు 12 నుంచి 15 రోజుల పాటు పంచగ్రహ కూటమి కొనసాగనుందని పండితులు తెలిపారు.

మాఘ పౌర్ణమి రోజున సూర్యుని, అమ్మవారిని భక్తితో ప్రార్థించే వారికి ఆయుష్షు వృద్ధి చెందడంతో పాటు, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు తొలగుతాయని విశ్వాసం. ముఖ్యంగా మఖ నక్షత్రం వచ్చిన సమయంలో అమ్మవారి పూజతో పాటు పితృదేవతారాధన చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.

పితృదేవతారాధన చేయడం వల్ల జన్మయోగంలో ఉన్న పిశాచ యోగం, ఇతర దోషాలు తొలగిపోవడంతో పాటు, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తగ్గి దేవతాశక్తి పెరుగుతుందని చెబుతారు. ఇవన్నీ ఫలించాలంటే మాఘ పౌర్ణమి రోజున అమ్మవారి ఆరాధనతో పాటు పితృదేవతారాధన తప్పనిసరిగా చేయాలని పండితుల సూచన. ప్రత్యేకంగా మఖ నక్షత్రం రోజున చేసే పితృదేవారాధన అత్యంత విశేష ఫలితాలను ఇస్తుంది, ఎందుకంటే మఖ నక్షత్రానికి పితృదేవతలే అధిదేవతలుగా పేర్కొనబడ్డారు.

మాఘ పౌర్ణమి రోజు చేయవలసిన పరిహారాలు

మాఘ పౌర్ణమి (ఫిబ్రవరి 1, 2026) రోజున

  • స్వయంపాకం దానం చేయడం

  • గోశాల వద్ద గోవులకు మేత వేయడం

  • వీలైనంత వరకు ధ్యానం చేయడం

  • తెల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వడం

  • పవిత్ర క్షేత్ర దర్శనం చేయడం

వంటి కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని చెబుతారు.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మాఘ పౌర్ణమి రోజున అమ్మవారి మంత్ర సాధన చేయడం అత్యంత శుభఫలితాలను ఇస్తుంది. మంత్ర సిద్ధి త్వరగా జరుగుతుందని విశ్వాసం. అలాగే పౌర్ణమి రోజున అమ్మవారి మంత్రాలతో పాటు గణపతి మంత్రాలను పఠించడం కూడా శుభప్రదంగా భావిస్తారు.

Also Read: KCR: కేసీఆర్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు

Magh Purnima: ఇలాంటి రోజు మళ్లీ 100 ఏళ్ల తర్వాతే.. ఏమేం చేయాలంటే..