Bihar: బిహార్‌లో జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ (Anant Singh) ఆస్పత్రి ప్రాంగణంలో సిగరెట్ తాగిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. పట్నాలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (IGIMS)లో ఆరోగ్య పరీక్షల కోసం తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం అనైతికమని ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
ये माननीय विधायक अनंत सिंह जी हैं,
अस्पताल में रील बनाने के लिए सिगरेट का कश और धुआं उड़ा रहे हैं,
ऐसे महापुरुष को जिताने के लिए बिहारवासियों का हृदय से धन्यवाद! 🙏🏻 pic.twitter.com/ipBwzoE9eS
— Luffy (@luffyspeaking) January 18, 2026
ఈ వీడియోను ఆర్జేడీ ప్రతినిధి ప్రియాంక భారతి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. నీతీశ్ కుమార్‌కు ఆప్తుడైన అనంత్ సింగ్ సిగరెట్ పొగతోనే బిహార్‌కు సుపరిపాలన తీసుకువస్తున్నాడని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, గతేడాది ప్రశాంత్ కిశోర్ అనుచరుడైన దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్ అరెస్టయ్యారు. ఆ సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మొకామా నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం అనంత్ సింగ్‌పై దాదాపు 28 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం.
