Udhayanidhi Stalin : తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె ప్రభుత్వం క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేసే అవకాశం ఉందని వర్గాలు ఇండియా టుడేకి తెలిపాయి. ఈ చర్య 2009 లోక్‌సభ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తన తండ్రి ఎంకే స్టాలిన్ మాదిరిగానే ఉంది.
డీఎంకే యువజన విభాగం నాయకుడు, చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయిన ఉదయనిధి డిసెంబరు 2022లో డిఎంకె మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ఏడాది ఉదయనిధిని రెండుసార్లు డిప్యూటీ సీఎం చేయాలని భావించినట్లు సమాచారం. కానీ, వివాదాల కారణంగా డీఎంకే ప్రణాళికలు వర్కవుట్ కాలేదు. ఈ ఏడాది జనవరిలో సనాతన ధర్మ వివాదం, ఆ తర్వాత కళ్లకురిచ్చి హూచ్ దుర్ఘటనతో ఆయన్ను డిప్యూటీ సీఎం చేయాలనే యోచన పడిపోయింది.

Udhayanidhi Stalin
జనవరి నెలలో ఉదయనిధి సనాతన ధర్మాన్ని “మలేరియా”, “డెంగ్యూ”తో పోల్చిన తర్వాత దాని నిర్మూలన కోసం పిలుపునిచ్చిన తరువాత సనాతన ధర్మ వివాదం చెలరేగింది. సనాతన ధర్మం కుల వ్యవస్థ, వివక్షపై ఆధారపడి ఉందని డిఎంకె మంత్రి వాదించారు.
ఆయన ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో పాటు పలు ఫిర్యాదులు, సుప్రీంకోర్టు జోక్యానికి దారితీసింది. ఇదిలావుండగా, జూన్ నెలలో జరిగిన కళ్లకురిచి హూచ్ దుర్ఘటన కారణంగా డీఎంకే ప్రభుత్వం మరోసారి కంగుతిన్నది . కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి 65 మంది చనిపోయారు.