Anurag Dobhal: డబ్బు, పేరు, ఫాలోయింగ్ ఉంటే జీవితం సంతోషంగా సాగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ తల్లిదండ్రుల ప్రేమ, ముఖ్యంగా తల్లి మమత లేకపోతే ఎంత విజయవంతమైన జీవితమైనా లోపల ఖాళీగా అనిపిస్తుంది. ఇలాంటి బాధే ఇప్పుడు ఒక ప్రముఖ యూట్యూబర్ జీవితాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ డోబాల్ (UK07 Rider) ఆత్మహత్యాయత్నం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. లక్షలాది మంది ఫాలోవర్లు, ఖరీదైన కార్లు, స్పోర్ట్స్ బైక్స్ ఉన్న జీవితం బయటకు చూస్తే ఎంతో గ్లామర్‌గా కనిపించినా, అతని మనసులో మాత్రం తీవ్రమైన ఆవేదన దాగి ఉందని ఈ ఘటనతో బయటపడింది.
కొన్ని రోజుల క్రితం అనురాగ్ తనకు నచ్చిన ఒక అమ్మాయిని, అది కూడా వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో అతడిని దూరం పెట్టారని సమాచారం. అంతేకాదు, కుటుంబ సభ్యుల నుంచి తనకు మానసికంగా వేధింపులు ఎదురవుతున్నాయని అనురాగ్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా వెల్లడించాడు. గత కొన్ని నెలలుగా తన జీవితం పూర్తిగా మారిపోయిందని, తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నానని కూడా చెప్పాడు. ఒకవేళ తనకు ఏదైనా జరిగితే అందుకు తన కుటుంబమే కారణమని కూడా హెచ్చరించాడు.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చాడు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై టయోటా ఫార్చ్యూనర్ కారును నడుపుతూ లైవ్‌లో కనిపించాడు. ఆ సమయంలో అతడు చాలా వేగంగా, దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నాడు. లైవ్ చూస్తున్న వేలాది మంది ముందు అతడు తన బాధను వ్యక్తం చేశాడు.
ఎర్రబడిన కళ్లతో, గొంతు దడదడలాడుతూ తన తల్లిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. “అమ్మా… వచ్చే జన్మలో అయినా నాకు ప్రేమ ఇవ్వు. నాకు నీ ప్రేమ చాలా అవసరం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు ధైర్యం చెప్పే వ్యక్తి ఒక్కరూ లేరని కూడా విలపించాడు. “ఇదే నా చివరి ప్రయాణం” అని చెబుతూ కారు స్పీడోమీటర్‌ను కెమెరాకు చూపించాడు.
ఆ సమయంలో దాదాపు 82 వేల మంది లైవ్ చూస్తుండగానే, “గుడ్‌బై” అని చెప్పి ఒక్కసారిగా కారును కుడివైపుకు తిప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టాడు. కారు భారీ వేగంతో ఉండటంతో అది పూర్తిగా ధ్వంసమైంది.
అదే సమయంలో అక్కడుగా వెళ్తున్న వారు వెంటనే స్పందించి అనురాగ్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన మీరట్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య పోరాడుతున్నట్లు సమాచారం.
ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. బయటకు కనిపించే విజయాల వెనుక కూడా వ్యక్తిగత జీవితంలో ఎంతటి మానసిక ఒత్తిడి ఉంటుందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.
YouTuber Anurag Dobhal aka UK07 Rider allegedly tried to take his own life by overspeeding
This is really a joker Suicide is not the solution to any problem. pic.twitter.com/UEsOvMY14W— 12th फेल (@balramm19757654) March 7, 2026
Also Read: Chicken: అబ్బ.. చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాలే రావు
Anurag Dobhal: ధైర్యం చెప్పే వాళ్లు ఒక్కరు కూడా లేరు: లైవ్ లోనే గుడ్ బై అంటూ..
