TVK Vijay: విజయ్ ర్యాలీలో మరోసారి ప్రమాదం

Terrible accident at TVK Vijay's road rally

Terrible accident at TVK Vijay's road rally

TVK Vijay: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈసారి ఎన్నికలు టీవీకే నేత విజయ్ (దళపతి) చుట్టూ తిరుగుతున్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఆయన కింగ్‌మేకర్‌గా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇటీవల టీవీకే నిర్వహిస్తున్న పార్టీ సమావేశాలు, సభలు, ర్యాలీలకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ ఇప్పటికే తన అనుచరులకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రత్యేకంగా కాన్వాయ్‌లు, సభల సమయంలో క్రమశిక్షణగా ఉండాలని కోరారు.

ఈ నేపథ్యంలో తూత్తూకుడిలో ఒక ఘటన చోటుచేసుకుంది. తూత్తూకుడి–నెల్లై హైవేపై వాగైకులం సమీపంలో విజయ్ కాన్వాయ్ వెళ్తుండగా, కొందరు కార్యకర్తలు టూవీలర్లపై ఆయన వాహనానికి దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి పలువురు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు గాయపడ్డారు.

ఘటనను గమనించిన విజయ్ వెంటనే తన కాన్వాయ్‌ను నెమ్మదించారు. గాయపడిన కార్యకర్తల పరిస్థితి గురించి ఆరా తీశారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు స్థానిక నాయకులకు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కార్యకర్తలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఏప్రిల్ 13న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Viral: అగరబత్తులకు బదులు.. ఇక్కడ దేవుని ముందు సిగరెట్ వెలిగిస్తారు

TVK Vijay: విజయ్ ర్యాలీలో మరోసారి ప్రమాదం