Instagram: తమిళనాడులో ‘ఇన్‌స్టాగ్రామ్ ఎలక్షన్స్’!

Tamil Nadu’s Instagram election: Rallies to reels, why parties’ focus is shifting to a battle for screens

Tamil Nadu’s Instagram election: Rallies to reels, why parties’ focus is shifting to a battle for screens

Instagram: తమిళనాడులో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఒకవైపు రాజకీయ నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తూ, హామీలు గుప్పిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు జెన్ జీ యువత మాత్రం ఈ ఎన్నికలను పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తోంది. వారి దృష్టి రాజకీయాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాపైనే ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఈ తరం కోసం ఒక ప్రత్యేకమైన “ఎలక్షన్ వేదిక”గా మారిపోయింది.

ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు, నేతల ప్రసంగాలు… ఇవన్నీ యువతకు ఇప్పుడు కంటెంట్‌గా మారాయి. “మేము ఆ మీటింగ్‌లో ఉన్నాం” అన్న విషయం చూపించడమే ప్రధాన లక్ష్యంగా, అక్కడికి వెళ్లి ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం చేస్తున్నారు. ప్రముఖ నాయకులతో సెల్ఫీలు, చిన్న స్టేట్‌మెంట్లు రికార్డ్ చేయడం, వెంటనే వాటిని రీల్స్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడం సాధారణమైపోయింది. ఎవరి రీల్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంది? ఎవరి వీడియో త్వరగా వైరల్ అయింది? అన్నదే ఇప్పుడు వారి మధ్య పోటీగా మారింది.

కొంతమంది యువత అయితే రాజకీయ సభలను ఒక అవకాశంగా తీసుకుని, తమ ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు. నేతల మాటలకన్నా, ఆ వీడియోకి వచ్చే లైక్స్, షేర్లు, కామెంట్లే వారికి ముఖ్యంగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ వల్ల ఎన్నికల ప్రచారానికి కొత్త రంగు అద్దినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మొత్తానికి, తమిళనాడులో ఈసారి ఎన్నికలు కేవలం బ్యాలెట్ బాక్స్ వరకే పరిమితం కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లు, రీల్స్, వైరల్ వీడియోల వరకు విస్తరించాయి. అందుకే చాలామంది దీనిని సరదాగా “ఇన్‌స్టాగ్రామ్ ఎలక్షన్స్” అని పిలుస్తున్నారు.

Also Read: Whatsapp: అక్కడ వాట్సాప్ బ్యాన్

Instagram: తమిళనాడులో ‘ఇన్‌స్టాగ్రామ్ ఎలక్షన్స్’!