BREAKING మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

Maharashtra Deputy CM dies plane crash

Maharashtra Deputy CM dies plane crash

BREAKING మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ బారామతిలో కుప్పకూలిన ఘటనలో పవార్ (66)తో పాటు మరో నలుగురు మరణించారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబయి నుంచి బారామతి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో విమానం క్రాష్ అయినట్లు సమాచారం.

రిపోర్టుల ప్రకారం, సాంకేతిక లోపం కారణంగా విమానంలో సమస్య తలెత్తి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నంలో అదుపుతప్పి నేలకు బలంగా పడిపోయింది. ప్రమాదం వెంటనే విమానంలో భారీ మంటలు చెలరేగాయి. ప్రభావం తీవ్రంగా ఉండటంతో విమానం రెండు ముక్కలైనట్లు తెలుస్తోంది. ప్రమాదంపై డీజీసీఏ (DGCA) స్పందించి, విమానంలో ప్రయాణించిన ఏడుగురిలో ఎవరూ బతకాలేదని వెల్లడించింది. అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, ఇద్దరు విమాన సిబ్బంది మరణించినట్లు సమాచారం.

అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్ రావ్ పవార్, మరియు ఆయన బాబాయి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్. శరద్ పవార్ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చిన అజిత్ పవార్, 1982లో తొలిసారి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. తరువాత 16 ఏళ్లపాటు పుణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేశారు.

1991లో బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికై రాజకీయంగా బలమైన స్థానం సంపాదించారు. అనంతరం ఆ సీటును బాబాయి శరద్ పవార్‌కు ఇచ్చి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. అదే సంవత్సరం జరిగిన ఉపఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

Also Read: Mumbai: మెట్రోరైలులో యాక్టర్ ఫీట్లు.. రూ.500 ఫైన్

BREAKING అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్