LPG Crisis: దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో LPG గ్యాస్ సరఫరా సమస్యలు కనిపిస్తున్నాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో కొంతమంది గ్యాస్ ఏజెన్సీల ముందు “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో గ్యాస్ సరఫరాపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్‌పై ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద హోటళ్లతో పాటు చిన్న టిఫిన్ సెంటర్లు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గడం వల్ల వ్యాపారం కొనసాగించడం కష్టమవుతోందని వారు అంటున్నారు.
అయితే ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశంలో గ్యాస్ పూర్తిగా కొరత ఏర్పడలేదని, సరఫరా వ్యవస్థను సమతుల్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి కీలక సేవలకు గ్యాస్ కొరత రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
అలాగే గృహ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. సాధారణ కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండేలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న సమస్య తాత్కాలికమేనని, త్వరలో సరఫరా సాధారణ స్థితికి వస్తుందని వారు తెలిపారు.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన సరఫరా వ్యవస్థలో ఉన్న మార్పుల కారణంగా తాత్కాలిక ఒత్తిడి ఏర్పడినప్పటికీ, దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాను నిలకడగా కొనసాగించేందుకు ప్రభుత్వం మరియు ఆయిల్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read: No-Cook Breakfast Recipes: గ్యాస్‌తో పని లేకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి
LPG Crisis: గ్యాస్ ఏజెన్సీల ముందు ‘నో స్టాక్’ బోర్డులు
