LPG Shortage: ఒక్క రోజులోనే 1.34లక్షల ఇండక్షన్ స్టవ్స్ విక్రయం

Huge demand for induction cooktop in India, 1.34 lakh units sold in one day amid LPG crisis

Huge demand for induction cooktop in India, 1.34 lakh units sold in one day amid LPG crisis

LPG Shortage: దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఇండక్షన్ స్టవ్స్ ఉపయోగించే దిశగా మొగ్గుచూపుతున్నారు. దీంతో మార్కెట్లో ఇండక్షన్ స్టవ్స్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

సాధారణంగా ఒక నెలలో సుమారు 1.80 లక్షల వరకు ఇండక్షన్ స్టవ్స్ విక్రయాలు జరుగుతాయి. అయితే ఇటీవల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ఒక్క రోజులోనే అమెజాన్‌లో 1.34 లక్షలకు పైగా ఇండక్షన్ స్టవ్స్ అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య కంపెనీలకే ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ అనూహ్య డిమాండ్‌ను తయారీ కంపెనీలు ముందుగానే ఊహించలేదు. అందువల్ల చాలా ప్రాంతాల్లో స్టాక్ పూర్తిగా అయిపోయి, దుకాణాల్లో ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితిపై ఆందోళన పెరగడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్స్ కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

Also Read: Monalisa Bhosle: ఏంటీ.. మత్తు ఇచ్చి మోనాలిసాను పెళ్లి చేసుకున్నాడా..??

LPG Shortage: ఒక్క రోజులోనే 1.34లక్షల ఇండక్షన్ స్టవ్స్ విక్రయం