August 15: భారతీయులకు ఆగస్టు 15 ఎంతో ప్రాధాన్యమైన రోజు. ఈ రోజున మన దేశం స్వాతంత్య్రం పొందింది. మనతో పాటు ప్రపంచంలోని మరో ఐదు దేశాలు కూడా ఇదే రోజున తమ స్వాతంత్య్ర దినోత్సవం లేదా విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటాయి.
1945లో జపాన్ నుండి విముక్తి పొందిన సందర్భంగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలు ఈ రోజును ‘లిబరేషన్ డే’గా నిర్వహిస్తాయి. 1971లో బ్రిటిష్ పాలన నుండి బహ్రెయిన్, 1960లో ఫ్రెంచ్ పాలన నుండి రిపబ్లిక్ ఆఫ్ కాంగో స్వాతంత్య్రం సాధించాయి. అలాగే 1940లో జర్మన్ కాన్ఫెడరేషన్ నుండి లిక్టెన్స్టీన్ స్వాతంత్య్రం పొందింది.
