Undermine: జీవితంలో కొంతమంది ఎప్పుడూ ఇతరులను తక్కువగా చూసే అలవాటు కలిగి ఉంటారు. ఆఫీస్‌లోనైనా, పక్కింట్లోనైనా, పరిచయస్తులైనా – ఇలాంటి మనస్తత్వం కలిగినవారితో మనకు అసౌకర్యం కలగవచ్చు.
కానీ, వారు మిమ్మల్ని చులకనగా చూస్తే, అది మీరు ఎదుగుతున్న సంకేతమని, మీ ప్రగతి వారికి నచ్చకపోవచ్చని గుర్తుంచుకోండి. దీన్ని నెగిటివ్‌గా కాకుండా, పాజిటివ్‌గా తీసుకుని ముందుకు సాగండి.
సమస్యను ఎలా చూడాలో నేర్చుకోండి:
ఎవరైనా హేళన చేస్తే, అది మీ వ్యక్తిత్వం కాదు – వారి ఆలోచనా స్థాయి మాత్రమే. సమస్య ఎంత పెద్దదో కంటే, దానిని మీరు ఎంత పెద్దదిగా భావిస్తున్నారనేదే ముఖ్యం. విపరీతంగా ఊహించడం మానేసి, ధైర్యంగా ఎదుర్కోవడం అలవాటు చేసుకోండి. అప్పుడు పెద్ద సమస్య కూడా చిన్నదిగా అనిపిస్తుంది.
నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడండి:
“ఇది సాధ్యం కాదు” అనే ఆలోచనే నిజమైన సమస్య. మీ విలువను మీరు మాత్రమే బాగా తెలుసుకోవాలి. ఇతరుల మాటలతో మనసు కుంగిపోకుండా, ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయడం నేర్చుకోండి. మీ మీద మీకున్న నమ్మకమే మీకు రక్షణ కవచం.
మైండ్‌సెట్‌ను మార్చుకోండి:
వాళ్లు మీకన్నా పైస్థాయిలో ఉన్నట్లు అనిపిస్తే, భయపడకుండా ఆ స్థాయికి చేరేందుకు ప్రయత్నించండి. ఎప్పుడూ సమస్య మీకంటే ఒక అడుగు వెనుక ఉండేలా ముందుకు కదలండి. వారితో పోల్చుకుని మీను తక్కువ అంచనా వేయకుండా, ఇంకా మెరుగ్గా ఉండటానికి కృషి చేయండి.
“లైట్ తీస్కో” ఫార్ములా:
ఎవరైనా చులకనగా చూస్తే, అది మీ ప్రగతి వారికి నచ్చకపోవడమే. వారి మాటలపై ఎక్కువగా ఆలోచిస్తే, మీరు ముందుకు సాగలేరు. కాబట్టి లైట్ తీసుకోవడం అలవాటు చేసుకోండి, మీ మార్గంలో నిశ్చయంగా సాగిపోవాలి.
మౌనమే సమాధానం:
హేళన చేసినా, పట్టించుకోకుండా, నవ్వుతూ, ప్రశాంతంగా మీ పనిలో మునిగితే, వారు ఆశించిన ప్రతిస్పందన రాక విసిగి వెనక్కి తగ్గుతారు. చివరికి, మీ మౌనమే వారికి సమాధానం అవుతుంది.
