Dark Neck: మెడ నలుపు తగ్గాలంటే?

Natural Home Remedies For Dark Neck

Natural Home Remedies For Dark Neck

Dark Neck: కొందరికి వయసు, ధూళి, సన్ ఎక్స్‌పోజర్, హార్మోన్ల మార్పులు లేదా ఇతర కారణాల వల్ల మెడ చర్మం నల్లబడుతుంది. మెడ మొత్తం డార్క్‌గా కనిపించడం వల్ల చాలామంది ఏ జ్యువెలరీ వేసుకోవడానికైనా ఇబ్బంది పడతారు. ఆ నలుపుని కవర్ చేయడానికి హై నెక్ టాప్స్, జాకెట్లు లేదా మొత్తం నెక్ కవర్ అయ్యే డ్రెస్సులు వేసుకోవడం కూడా చూస్తుంటాం. అయితే, ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

1. నిమ్మరసం – తేనె మిశ్రమం

నిమ్మరసంలో చర్మంపై ఉండే మలినాలను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇదే సమయంలో తేనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు స్కిన్‌కు శాంతిని ఇస్తాయి. రెండింటిని సమాన పరిమాణంలో తీసుకుని కలిపి మెడపై అప్లై చేయాలి. దాదాపు 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. వారానికి 2–3 సార్లు చేస్తే మంచి మార్పు కనిపించవచ్చు.

2. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్‌ కూడా మెడపై ఉన్న నల్ల దనం తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌లో అంతే పరిమాణంలో నీళ్లు కలిపి మెడ చుట్టూ రాసి 10–15 నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. క్రమం తప్పకుండా చేస్తే ఫలితాలు గమనించవచ్చు.

3. పసుపు – పాలు ప్యాక్

పసుపులో స్కిన్‌ని బ్రైట్‌గా చూపించే లక్షణాలు ఉంటాయి. గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసి పేస్ట్‌గా తయారు చేసి మెడపై అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత తేలికపాటి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పాలు స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేసి సాఫ్ట్‌గా ఉంచుతాయి.

4. అలోవెరా జెల్ ప్యాక్

అలోవెరా జెల్‌లో చర్మానికి మంచిచేసే అనేక గుణాలు ఉన్నాయి. అలోవెరా జెల్‌లో కొద్దిగా పసుపు, కాఫీ పొడి కలిపి ప్యాక్‌లా తయారు చేయాలి. మెడపై రాసి ఆరిన తర్వాత కొద్ది నీళ్లు చల్లి స్క్రబ్ చేస్తూ కడగాలి. దీంతో నలుపు తగ్గి స్కిన్ కొద్దిగా మెరిసేలా కనిపిస్తుంది.

5. ఓట్స్ – పెరుగు మిశ్రమం

ఓట్స్‌లో ఉన్న గుణాలు డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. కొద్దిగా పెరుగుతో కలిపి మెత్తగా మారే వరకు ఉంచి మెడపై రాయాలి. కొంతసేపటికి స్క్రబ్ చేస్తూ శుభ్రం చేయాలి. దీంతో బ్రైట్నెస్ పెరిగినట్లు అనిపిస్తుంది.

Also Read: Srinivasamangapuram: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

Dark Neck: మెడ నలుపు తగ్గాలంటే?