Dasara: రేపు చికెన్, మటన్ తింటున్నారా?

Dasara: Are you eating chicken and mutton tomorrow?

Dasara: Are you eating chicken and mutton tomorrow?

Dasara: రేపు గాంధీ జయంతి, దసరా పండుగ ఒకేసారి రావడంతో తెలంగాణలో మాంసం, మద్యం షాపులు పూర్తిగా మూసివేయనున్నట్లు అధికారులు ఇప్పటికే స్పష్టంచేశారు. అందువల్ల నేడు మార్కెట్లలో కాస్త హడావుడి వాతావరణం కనిపిస్తోంది. చికెన్, మటన్, లిక్కర్ ముందుగానే తెచ్చుకోవాలని ప్రజలు ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణలో దసరా అంటే ముక్క, చుక్క అని అంటుంటారు. అంటే ఈ పండుగ రోజున మాంసం, మద్యం తీసుకోవడం ఒక ఆనవాయితీలా మారిందని చాలామంది చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. కొంతమంది సామూహికంగా మేకలు కొట్టి మాంసం పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు పట్టణాల్లో ముందుగానే షాపులకు వెళ్లి చికెన్, మటన్, లిక్కర్ స్టాక్ చేసుకుంటున్నారు.

అయితే అధికారుల సూచన ప్రకారం రేపు అన్ని మాంసం షాపులు, మద్యం దుకాణాలు తప్పనిసరిగా బంద్ కావాల్సిందే. ఇది చట్టపరంగా తప్పనిసరి అని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎవరు ముందుగానే కొనుగోలు చేసుకుంటే వారికే రేపు విందు సిద్ధం అవుతుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. “రేపు నాన్‌వెజ్ తింటున్నారా? లేక ఇవాళే స్టాక్ చేసారా?” అంటూ జోకులు వేస్తున్నారు. మొత్తానికి దసరా రోజు మాంసం, మద్యం షాపులు బంద్ కావడంతో, ప్రజలు ముందుగానే సిద్ధమవుతున్నారు.

Also Read: BREAKING: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Dasara: రేపు చికెన్, మటన్ తింటున్నారా?